AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srivalli Song: తెలుగులోనే ‘శ్రీవల్లి’ సాంగ్ పాడిన తమిళ కలెక్టర్.. వావ్ అనకుండా ఉండలేరు

ఇప్పటికీ పుష్ప పాటలు, స్టెప్పులు, పంచ్‌ డైలాగ్‌లు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.  దేశ విదేశాల్లో ఎంతోమంది ప్రముఖులు, సామాన్యులు పుష్ప పాటలకు డ్యాన్ చేశారు. తగ్గేదే లే అంటూ డైలాగులు చెప్పారు.

Srivalli Song: తెలుగులోనే 'శ్రీవల్లి' సాంగ్ పాడిన తమిళ కలెక్టర్.. వావ్ అనకుండా ఉండలేరు
Collector Sings Srivalli Song
Ram Naramaneni
|

Updated on: Apr 09, 2022 | 12:54 PM

Share

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun), కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Director Sukuamr) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప’(Pushpa). ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌ 17న విడుదలై  పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికీ పుష్ప పాటలు, స్టెప్పులు, పంచ్‌ డైలాగ్‌లు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.  దేశ విదేశాల్లో ఎంతోమంది ప్రముఖులు, సామాన్యులు పుష్ప పాటలకు డ్యాన్ చేశారు. తగ్గేదే లే అంటూ డైలాగులు చెప్పారు. కాగా ఈ సినిమా విడుదలకు ముందే పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీత సారథ్యం వహించిన ఈ ఆల్బమ్‌లోని అన్నీ పాటలు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ సాధించాయి. లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ మూవీలో అన్ని పాటలను రాశారు. కాగా ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పాలి. ముఖ్యంగా ‘చూపే బంగారమాయెనా శ్రీవల్లి..’ సాంగ్‌ ఒక ఊపు ఊపేసింది. యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్ సాధించింది. 150 మిలియన్ల వ్యూస్ దాటి ఇప్పటికీ దూసుకుపోతుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో..  యంగ్‌ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌(Sid Sriram) అద్భుతంగా ఆలపించాడు.

ఈ పాటను చాలా మంది తమ స్టైల్ లో పాడటం.. లేదా ఈ పాటలోని హుక్ స్టెప్పును అనుసరించడం వంటివి చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. కాగా తాజాగా ఈ పాట మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తమిళనాడులోని కరూర్ జిల్లా కలెక్టర్ ప్రభుశంకర్.. శ్రీవల్లి పాటను అద్భుతంగా పాడారు. అందుకు తగ్గట్లుగా గిటార్ కూడా వాయించారు.  ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు తన మాతృభాష కానప్పటికీ ఆయన స్పష్టంగా.. చెవుల్లో అమృతం పోసినట్లు ఆయన పాడిన తీరు ప్రశంసించాల్సిందే. కాగా తనకు తెలుగు రాదని, తప్పులు ఉంటే క్షమించాలని కోరడం ఆయన గొప్పదనాన్ని తెలుపుతుంది.

Also Read: Chiru Godfather: టాలీవుడ్ నుంచి బిగ్ న్యూస్.. చిరు సినిమాలో కీ రోల్‌లో పూరి.. అఫిషియల్