Optical Illusion: నోరూరించే మామిడి పండ్ల మధ్య ఏముందో కనిపెట్టారా..?

కొన్ని ఫోటోలు చాలా విచిత్రంగా ఉంటాయి. మన కళ్ళని ఇట్టే మోసం చేసేస్తాయి. చూడటానికి స్పష్టంగా ఉన్న అందులో మనం గమనించనివి ఎదో ఒకటి దాగి ఉంటాయి.

Optical Illusion: నోరూరించే మామిడి పండ్ల మధ్య ఏముందో కనిపెట్టారా..?
Pic
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 09, 2022 | 12:00 PM

కొన్ని ఫోటోలు చాలా విచిత్రంగా ఉంటాయి. మన కళ్ళని ఇట్టే మోసం చేసేస్తాయి. చూడటానికి స్పష్టంగా ఉన్న అందులో మనం గమనించనివి ఎదో ఒకటి దాగి ఉంటాయి. ఇలా మెదడుకు పదును పెట్టె ఫోటోలు నెట్టింట కోకొల్లలు. చాలా ఫోటోల్లో నమ్మలేని నిజాలు ఉంటాయి. తాజాగా పైన కనిపిస్తున్న ఫొటోలో కూడా ఒకటి దాగి ఉంది. గుర్తుపట్టడం పెద్ద కష్టమేమి కాదు. కానీ అంత సులువు కూడా కాదు.  కాస్త మెదడుకు పని చెప్తే కనిపెటేయ్యోచు. ఇలాంటి ఫోటో పజిల్స్ మనకు స్ట్రెస్ బస్టర్స్ గా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు నెట్టింట వైరల్ అయిన వాటిలో ఎక్కువగా బొమ్మల్లో కనిపించే వస్తువుల ఆధారంగా మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ఫోటోలనే చూసి ఉంటారు.

అలా కాకుండా మీ కళ్లను మాయ చేసే ఇల్యూజన్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా.? అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫోటోలను చూసే ఉంటారు. పైన ఉన్న ఫోటో కూడా అలాంటిదే. పైనున్న ఫొటోలో మామిడి పండ్ల మధ్యలో ఓ అందమైన చిలక కూడా ఉంది కనిపించిందా.. దీక్షణంగా చూడండి కనిపిస్తుంది. నిజంగా ఒక్క క్షణం మన కళ్ళను మనమే నమ్మలేక పోయాం కద.. మామిడి పండ్ల రంగులోనే ఓ చిలక వాటి మధ్య దాగి ఉంది. ఇంతకు చిలక కనిపించిందా.. లేకపోతే కింది ఫోటోను చూడండి.

1

1