Viral Video: నమ్మశక్యం కానీ సాహసం.. ఆకాశంలో, ఆరు వేల అడుగుల ఎత్తులో తాడుపై అవలీలగా..

Viral Video: తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని ఆశపడుతుంటారు. సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం కోసం పరితపిస్తుంటారు. రకరకాల సాహసాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇలా ఎవరూ చేయని పనులు చేసే వారే గిన్నీస్‌ వరల్డ్‌..

Viral Video: నమ్మశక్యం కానీ సాహసం.. ఆకాశంలో, ఆరు వేల అడుగుల ఎత్తులో తాడుపై అవలీలగా..
Viral
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 09, 2022 | 9:35 AM

Viral Video: తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని ఆశపడుతుంటారు. సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం కోసం పరితపిస్తుంటారు. రకరకాల సాహసాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇలా ఎవరూ చేయని పనులు చేసే వారే గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో (Guinness World Record) చోటు దక్కించుకుంటారు. ఈ క్రమంలో వీరి చేసే సాహసాలు చూసే వారితో ఔరా అనిపిస్తాయి. తాజాగా అలాంటి ఓ రేర్‌ ఫీట్‌ను సాధించాడు బ్రెజిల్‌కు చెందిన రాఫెల్‌ జుగ్నో బ్రిడి. ఏకంగా ఆకాశంలో తాడుపై అవలీలగా నడిచి గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నాడు. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఈ సాహసాన్ని నిజం చేసి చూపించాడు.

వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన రాఫెల్‌ జుగ్నో బ్రిడికి 6,323 అడుగుల ఎత్తులో రెండు హాట్‌ బెలూన్ల మధ్య ఏర్పాటు చేసిన తాడుపై నడిచాడు. ఈ ఎత్తు దుయాబ్‌లోని బుర్జ్‌ ఖలీఫాకు రెండింతలు. ఇలా 25 సెంటీమీటర్ల తాడుపై ఎలాంటి సహాయం లేకుండా నడిచేశాడు. అత్యంత ఎత్తులో తాడుపై ఒంటరిగా నడిచిన వ్యక్తిగా రాఫెల్‌ గిన్నీస్‌ రికార్డును సొంతం చేసుకుటున్నట్లు గిన్నీ వరల్డ్‌ బుక్‌ సంస్థ ప్రకటించింది.

ఈ సాహసానికి సంబంధించిన వీడియోను గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ నిర్వాహకులు తమ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూస్తుంటేనే ఊపిరి బిగి పట్టేలా ఉంటే, అతని పరిస్థితి ఏంటో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి నమ్మశక్యం కానీ ఈ సాహసానికి సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read:  Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

18 Pages: కుర్ర హీరో కెరీర్‌కు ఈ మూవీ మైలేజ్ పెంచుతుందా..? నిఖిల్ ఆశలన్నీ సుకుమార్ సినిమా పైనే..

Gold Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే