Chiru Godfather: టాలీవుడ్ నుంచి బిగ్ న్యూస్.. చిరు సినిమాలో కీ రోల్‌లో పూరి.. అఫిషియల్

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ హిట్‌ ఫిల్మ్‌ ‘లూసీఫర్‌’కు తెలుగు రీమేక్‌ ఇది.

Chiru Godfather: టాలీవుడ్ నుంచి బిగ్ న్యూస్.. చిరు సినిమాలో కీ రోల్‌లో పూరి.. అఫిషియల్
Puri Chiru
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 09, 2022 | 11:50 AM

Megastar Chiranjeevi : మెగాస్టార్‌ చిరంజీవి.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వెండితెరపై రాణించాలనుకునే వారికి ఇన్‌స్పిరేషన్. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని.. సినిమా ఫీల్డ్‌లో రాణిస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఇక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh ).. యంగ్ ఫిల్మ్ మేకర్స్‌కు ఒక గైడ్ లాంటి వ్యక్తి. ఈయన్ను కూడా చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు. కాగా పూరి అంటే చిరుకి.. చిరు అంటే పూరికి చాలా ఇష్టం. వీరిద్దరి కాంబోలో మూవీ చేద్దామనుకున్నా.. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. కానీ వీరద్దరూ కలిసి ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అవును.. పూరి కూడా నటుడు అయిపోతున్నారు. మోహన్‌రాజా(Mohan Raja) దర్శకత్వంలో చిరు హీరోగా ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ హిట్‌ ఫిల్మ్‌ ‘లూసీఫర్‌’కు  తెలుగు రీమేక్‌ ఇది. వేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీలో బిగ్ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఈ చిత్రంలో ఓ కీ రోల్‌లో కనిపించబోతున్నాడు. అతని పాత్రకు సంబంధించిన షూటింగ్‌ని కూడా కంప్లీట్ అయ్యింది. ఇదే మూవీలో టాప్ డైరక్టర్‌ పూరి జగన్నాథ్‌ కూడా  ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

‘నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేసాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే ‘గాడ్‌ ఫాదర్‌’లో ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తున్నాడు’అంటూ చిరంజీవి ట్వీట్‌‌లో రాసుకొచ్చారు. దీంతో ఈ మూవీ క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో పూరి పాత్ర ఎలా ఉంటుంది.. ఎంత నిడివి ఉంటుందనే విషయాలపై చర్చ మొదలైంది. కాగా పూరి ఓ జర్నలిస్ట్ రోల్‌లో నటించనున్నారని వినికిడి. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో.. నయనతార, సత్యదేవ్, బ్రహ్మాజీ, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: ఏమన్నా స్కెచ్చా ఇది.. ట్రాక్టర్ హైడ్రాలిక్ లేపగానే కంగుతిన్న పోలీసులు