Telangana: ఏమన్నా స్కెచ్చా ఇది.. ట్రాక్టర్ హైడ్రాలిక్ లేపగానే కంగుతిన్న పోలీసులు

స్మగ్లర్లు రోజురోజుకి తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. పోలీసులను విస్మయానికి గురిచేస్తున్నారు. తాజాగా ఖమ్మం పోలీసులు స్మగ్లర్ల తెలివికి కంగుతిన్నారు.

Telangana: ఏమన్నా స్కెచ్చా ఇది.. ట్రాక్టర్ హైడ్రాలిక్ లేపగానే కంగుతిన్న పోలీసులు
Telangana Crime
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 09, 2022 | 9:44 AM

Khammam: మత్తు నుంచి యువతను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ సప్లై చేసే అక్రమార్కులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వినూత్నం పద్దతులను అవలంభిస్తున్నారు. తాజాగా సుమారు 250 కిలోల గంజాయి(Ganja)ని  పట్టుకున్నారు ఖమ్మం పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా ఒడిశా(Odisha) నుంచి రాజస్థాన్‌కు తరలిస్తుండగా.. స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు వాడిన రెండు ట్రాక్టర్లు, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. అయితే ఇక్కడ స్మగ్లర్లు.. పుష్ప రేంజ్‌లో చాలా తెలివిగా ఆలోచించారు. ఒడిశా నుంచి గంజాయిని తరలించేందుకు ట్రాక్టర్లకు ప్రత్యేక అమరికలు చేశారు. ట్రాక్టర్‌ కింది భాగంలో ప్రత్యేకంగా అరలు తయారు చేయించారు. అయినా పోలీసులు కూడా ఈ మధ్య అలెర్ట్‌గా ఉంటున్నారు.

ఖమ్మం బుర్హాన్​పురంలో రాజస్థాన్‌కు చెందిన లారీల్లో గంజాయి ఎక్కిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని సీపీ విష్ణు వారియర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గంజాయిని అరికడుతూనే.. అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఒక నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని వివరించారు. గంజాయిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు సీపీ రివార్డులు అందజేశారు.

Also Read:  Telangana: మరోసారి వాయింపు.. టికెట్‌ ఛార్జీలు పెంచిన TSRTC.. నేటి నుంచే అమల్లోకి