Telangana: మరోసారి వాయింపు.. టికెట్‌ ఛార్జీలు పెంచిన TSRTC.. నేటి నుంచే అమల్లోకి

తెలంగాణ ఆర్టీసీ మరోసారి ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. డీజిల్ సెస్ పేరుతో టికెట్ ఛార్జీలు పెంచింది. పెంచిన ఛార్జీలు శనివారం నుంచే అమల్లోకి రానున్నాయి.

Telangana: మరోసారి వాయింపు.. టికెట్‌ ఛార్జీలు పెంచిన TSRTC.. నేటి నుంచే అమల్లోకి
Tsrtc
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 09, 2022 | 9:15 AM

తెలంగాణ ఆర్టీసీ బాదుడు ఆపడం లేదు. ప్రయాణీకుల నడ్డి విరుస్తుంది.  మరోసారి ఛార్జీలు పెంచింది. ఇప్పటికే రౌండ్ అప్ అంటూ ఒకసారి వాయించారు. టోల్ ప్లాజాల ఛార్జీలు పెరిగాయని టోల్ గేట్ల వద్ద ఛార్జీలు పెంచారు. ప్యాసింజర్ సెస్(passenger cess) కూడా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తాజాగా డీజిల్ సెస్( diesel cess) వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో పాసింజర్ నుంచి డీజిల్ సెస్ కింద రూ.2 లు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసుల్లో ఒక్కో పాసింజర్ నుంచి రూ.5లు వసూలు చేస్తున్నారు. పెంచిన ఛార్జీలు శనివారం(9 ఏప్రిల్) నుంచి అమల్లోకి వచ్చాయి. రోజు రోజుకు డీజిల్ ధరలు పెరుగుతున్నాయని.. సంస్థపై భారం పడకుండా డీజిల్ సెస్ అమలు చేయాల్సి వస్తుందని యాజమాన్యం చెబుతుంది. ప్రజలు ఈ విషయం అర్థం చేసుకుని.. సహకరించాలని టీఎస్​ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్(Bajireddy Govardhan), ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

 ఆర్టీసీలో ప్రతి రోజు 6 లక్షల లీలర్ల డీజిల్​ను వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో చమురు ధరలు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. 2021 డిసెంబరులో రూ.85 ఉన్న డీజిల్​ ధర… ప్రస్తుతం రూ.118 కి చేరింది,   దీంతో డీజిల్ సెస్ అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే డీజిల్ సెస్ విధించాల్సి వచ్చిందని TSRTC తెలిపింది.

Also Read: Viral: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి.. తొలి రాత్రి వధువు చెప్పిన నిజంతో అంతా కొలాప్స్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..