Samantha: అఖిల్‌ బర్త్‌డే రోజు ఆసక్తికర పోస్ట్‌ చేసిన సమంత.. వైరల్‌ అవుతోన్న వార్త..

Samantha: సమంత, నాగచైతన్యల విడాకుల వ్యవహారం ఇండస్ట్రీలో ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట వైవాహిక బంధం నుంచి విడిపోయి ఆరు నెలలు గడుస్తోంది. అయితే ఇప్పటికీ వీరిద్దరి సంబంధించిన ఏదో ఒక వార్త..

Samantha: అఖిల్‌ బర్త్‌డే రోజు ఆసక్తికర పోస్ట్‌ చేసిన సమంత.. వైరల్‌ అవుతోన్న వార్త..
Akhil Samantha
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 09, 2022 | 11:28 AM

Samantha: సమంత, నాగచైతన్యల విడాకుల వ్యవహారం ఇండస్ట్రీలో ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట వైవాహిక బంధం నుంచి విడిపోయి ఆరు నెలలు గడుస్తోంది. అయితే ఇప్పటికీ వీరిద్దరి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంది. అటు సమంత కానీ, ఇటు నాగ చైతన్య కానీ ఇద్దరిలో ఎవరు సోషల్‌ మీడియాలో ఏ పోస్ట్ చేసినా అది వైరల్‌గా మారడం పరిపాటుగా మారింది. అయితే వీరిద్దరు ఇప్పటి వరకు ఒకరి గురించి మరొకరు ప్రస్తావిస్తూ ఎలాంటి పోస్టులు చేయలేదు. అయితే తాజాగా తొలిసారి సమంత అక్కినేని కుటుంబానికి సంబంధించి ఓ పోస్ట్‌ చేసింది.

శుక్రవారం (ఏప్రిల్‌ 9) అఖిల్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు అఖిల్‌కు బర్త్‌డే విషెస్‌ చెబుతూ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు. ఈ క్రమంలోనే సమంత కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అఖిల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్ట్‌ చేసింది. అఖిల్‌ ఫోటోను షేర్‌ చేసిన సామ్‌.. ‘హ్యాపీ బర్త్‌డే అఖిల్‌. ఈ ఏడాది అంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, గాడ్‌ బ్లెస్‌’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం సామ్‌ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌ అవుతోంది. విడాకుల తర్వాత తొలిసారి అక్కినేని కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రస్తావిస్తూ పోస్ట్‌ చేయడంతో ఇప్పుడు ఈ టాపిక్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.

Samantha

ఇదిలా ఉంటే విడాకుల తర్వాత సమంత సినిమాల్లో బిజీగా మారింది. పుష్పలో స్పెషల్‌ సాంగ్‌తో మొదలైన సామ్‌ రచ్చ కొనసాగుతోంది. తెలుగులో ఇప్పటికే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సామ్‌, యశోద చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్ట్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఈ బ్యూటీ అక్కడ కూడా బిజీగా మారింది. ఇక హిందీలో వరుస ప్రాజెక్టులకు ఓకే చెప్పడంతో సామ్‌ ఇటీవల ముంబయికి షిఫ్ట్‌ అయిన విషయం తెలిసిందే.

Also Read: జమ్మూ కాశ్మీర్ భద్రతా బలగాల భారీ విజయం.. రెండు ఎన్‌కౌంటర్లలో ‘లష్కరే తోయిబా’ కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం

Petrol Price: పెరుగుతోన్న ధరల నుంచి కాస్త ఊరట.. వరుసగా మూడో రోజు స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.

Tamannaah Bhatia: పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.. తమన్నా పెళ్లి ఎప్పుడంటే..