Telangana PRC: ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. పీఆర్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

Telangana PRC: పీఆర్సీ నివేదికపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్..

Telangana PRC: ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. పీఆర్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..
Follow us

|

Updated on: Jan 29, 2021 | 7:06 PM

Telangana PRC: పీఆర్సీ నివేదికపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. వరంగల్‌లో గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘాల డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు. పీఆర్సీ నివేదిక అశాస్త్రీయంగా ఉందన్నారు. దానిని తాము కూడా ఒప్పుకోబోమని అన్నారు. ఉద్యోగుల పీఆర్సీ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మంచి పీఆర్సీ సాధించుకుందాం అని ఉద్యోగులకు ఆయన సూచించారు. పీఆర్సీ గురించి ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇదే సమయంలో పీఆర్సీపై విపక్ష నేతల వైఖరిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో 43శాతం పీఆర్సీ ఇచ్చినప్పుడు కొందరు నేతలు తలలు బాదుకున్నారని, ఇప్పుడు వాళ్లే పీఆర్సీ ఇవ్వడం లేదంటూ మొత్తుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శలు గుప్పించారు. ఉద్యోగులు సక్రమంగా పని చేస్తున్నారు కాబట్టే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. ఉద్యోగుల శ్రమను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తిస్తారని, అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని ప్రకటిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి పీఆర్సీ నివేదిక బహిర్గతమైన విషయం తెలిసిందే. పీఆర్సీ నివేదికలో ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను ఖరారు చేశారు. దీనిపై ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 7.5 శాతాన్ని అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఆ మేరకు కొద్ది రోజులుగా ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనలు కూడా చేపట్టారు.

ఇదిలాఉంటే.. వేతన సవరణ సంఘం ఇటీవలే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో కీలక ప్రతిపాదనలు చేసింది. 2018 జులై 1 నుంచి ఈ వేతన సవరణ అమలుకు సిఫారసు చేసిన కమిషన్.. ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇక ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలు సిఫారసు చేయగా.. గరిష్ఠ వేతనం రూ. 1,62,070 గా ప్రతిపాదించింది. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచొచ్చని సూచించింది. ఉద్యోగుల గ్రాట్యూటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచొచ్చని నివేదికలో పేర్కొంది. శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంచిన పీఆర్సీ కమిటీ.. హెచ్‌ఆర్‌ఏను తగ్గించింది. ఇక సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచుతూ ప్రతిపాదించింది.

Also read:

Israeli embassy blast: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు.. పలు కార్లు ధ్వంసం

Economic Survey 2020-21 LIVE : కార్మిక సంస్కరణల చరిత్రలో మైలురాళ్లు ఈ సంవత్సరాలు : సిఇఎ కృష్ణమూర్తి సుబ్రమణియన్