Telangana Ministers: కూల్ డ్రింక్ కంటే కల్లే బెటర్.. ఆచరించి చూపిన మంత్రులిద్దరు..
Telangana Ministers: తాటికల్లు మస్తుగుంటదీ.. అంటూ ‘బతుకమ్మ’ సినిమాలో పాట గుర్తుందా?.. తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపిన ఆ పాటను..
Telangana Ministers: తాటికల్లు మస్తుగుంటదీ.. అంటూ ‘బతుకమ్మ’ సినిమాలో పాట గుర్తుందా?.. తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపిన ఆ పాటను అంత ఈజీగా ఎలా మరిచిపోతాంలేండి.. తాటికల్లును చూస్తే లొట్టలేయని వారురెవరుండరంటే అతిశయోక్తి కాదు.. అయితే సామాన్యులే కాదు.. మంత్రులు కూడా తామేం తక్కువ కాదని నిరూపించుకున్నారు. ఓ పట్టుపట్టి కల్లు ముంతను ఖాళీ చేశారు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్. శుక్రవారం నాడు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్ జనగామ జిల్లాలో పర్యటించారు. పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని కొడకండ్ల మండలం రామవరంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆ గ్రామంలో పర్యటించిన ఇద్దరు మంత్రులు.. గీతన్నను చూసి తెగ ముచ్చటపడ్డారు. కల్లు తాగాలని నిర్ణయించుకున్నారు. సామాన్య ప్రజల్లాగే తాటిచెట్టు కింద కూర్చొని గీత కార్మికులతో తాటికల్లును ఒడిపించుకున్న మంత్రులిద్దరూ తాటిరేక(ఆకు) లో కల్లును సేవించారు. అయితే, మంత్రులు కల్లు తాగడం చూసిన స్థానికులు అవాక్కయ్యారు.
అయితే, కల్లు తాగడంపై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తాటికల్లు ప్రత్యేకతను చాటి చెప్పేందుకే తాము దానిని తాగామని చెప్పారు. దీనిపై చిల్లర కామెంట్స్ చేయొద్దని కోరారు. కూల్ డ్రింక్స్ కంటే కల్లు ఎంతో శ్రేష్ఠమైనదని పేర్కొన్నారు. ప్రకృతి సిద్ధంగా వచ్చే తాటికల్లు ఆరోగ్యానికి మంచిదని చెప్పుకొచ్చారు. కాగా, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన అనంతరం ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. రాష్ట్రంలో గీత కార్మికులను అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. కల్లు విక్రయాలను ప్రోత్సహిస్తూ.. గీత కార్మికుల జీవనోపాధికి భరోసానిస్తోంది ప్రభుత్వం. కల్లును, నీరాను ప్రోత్సహించేందుకు రాష్ట్ర మంత్రులు అనేక సందర్భాల్లో వాటిని సేవించిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావులు తాటికల్లును సేవించి మరోసారి కల్లు విశిష్ఠతను వివరించే ప్రయత్నం చేశారు.
Minister Srinivas Goud Tweet:
జనగామ జిల్లాలోని రామవరం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొనేందుకు వెళ్లే మార్గమధ్యంలో గీత కార్మికులు ఉన్న మండవ వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. pic.twitter.com/BXAsKyr2xC
— V Srinivas Goud (@VSrinivasGoud) January 29, 2021
Also read:
Israeli embassy blast: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు.. పలు కార్లు ధ్వంసం