ముగిసిన సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల వారణాసి ఆధ్యాత్మిక పర్యటన.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించామన్న ఎమ్మెల్సీ కవిత
వారణాసిలో సీఎం కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర కుటుంబ సభ్యుల రెండు రోజుల ఆధ్యాత్మిక పర్యటన..
వారణాసిలో సీఎం కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర కుటుంబ సభ్యుల రెండు రోజుల ఆధ్యాత్మిక పర్యటన ముగిసింది. శుక్రవారం వేకువజాము నుండి పలు దేవాలయాలను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శుక్రవారం తెల్లవారుజామున ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అన్నపూర్ణ దేవాలయాన్ని దర్శించుకుని, ఆచార్య దీపక్ మాల్వియా ఆధ్వర్యంలో అన్నపూర్ణదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రఖ్యాత దుందిరాజ్ ఆలయం చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, గణనాథుని దర్శించుకున్నారు. ఆచార్య దీపక్ మాల్వియా, శంకర్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ‘గణేష్ పూజ’ లో ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వామి వారికి పుష్పాభిషేకం జరిపారు. అనంతరం వరాహి దేవాలయాన్ని దర్శించుకున్నారు.
ఆ తరువాత తులసీ ఘాట్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, శ్రీమతి శోభ మరియు ఇతర కుటుంబ సభ్యులు, ప్రాచీన హనుమాన్ మందిరాన్ని దర్శించుకున్నారు. చివరగా నిషర్ధన్ ఘాట్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, స్థానికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.
It was a privilege to offer my prayers at Annapurna Temple. It was indeed a blissful feeling to have worshiped Mahadev and Maa Parvati. #Varanasi #Kashi pic.twitter.com/aLEgllFCv4
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 29, 2021
“नमो भगवते दशपापहराये गंगाये नारायण्ये रेवत्ये शिवाये दक्षाये अमृताये विश्वरुपिण्ये नंदिन्ये ते नमो नम:” दशाश्वमेध घाट पर गंगा आरती करने का सौभाग्य प्राप्त हुआ। हर हर गंगे। हर हर महादेव। pic.twitter.com/hpth82qJWP
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 28, 2021
जनम से मोक्ष तक की यही राह है, काशी धाम की कुछ अलग ही बात है। In the aegis of Lord Kashi Vishwanath and Maa Ganga. pic.twitter.com/9gYZtJ48pJ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 28, 2021