Donations for Ram Mandir: అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భారీగా విరాళమిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్..
Donations for Ram Mandir: అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి దేశ వ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Donations for Ram Mandir: అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి దేశ వ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు మొదలు.. సామాన్యుల వరకు తమకు తోచినంత మొత్తాన్ని ఆలయ నిర్మాణం కోసం విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు అయోధ్య రామాలయ నిర్మాణం కోసం తమ వంతు విరాళాలు ప్రకటించగా.. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విరాళం ప్రకటించారు. రామ మందిరం నిర్మాణం కోసం దేవేంద్ర ఫడ్నవీస్ రూ. లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. దానికి సంబంధించిన చెక్కును ముంబైలోని తన నివాసంలో దేవేంద్ర ఫడ్నవీస్ సతీసమేతంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరీజీ మహారాజ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ విరాళాల సేకరణ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు రామాలయానికి భారీగా విరాళాలు ఇచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మొదలు.. కీలక నేతలు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు తమ వంతు విరాళాలు ఇచ్చారు. ఈ విరాళాల సేకరణ కార్యక్రమం ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది.
Also read: