Israeli embassy blast: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు.. పలు కార్లు ధ్వంసం
ఢిల్లీలో కలకలం చెలరేగింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు కార్ల ధ్వంసమయ్యాయి.

Israeli embassy blast: ఢిల్లీలో కలకలం చెలరేగింది. ఇజ్రాయెల్ రాయభార కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు కార్ల ధ్వంసమయ్యాయి. పేలుడు జరిగిన ప్రదేశానికి ఢిల్లీ పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. ఫుట్‌పాత్ సమీపంలో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం అందుతోంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం రాజధాని నడిబొడ్డున ఉన్న ఔరంగజేబ్ రోడ్‌లో ఉంది. బీటింగ్ రీట్రీట్ కార్యక్రమానికి 1.4 కిలోమిటర్ల దూరంలో ఈ పేలుడు సంభంవించింది. పేలుడుకు ఐఈడీ ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. పూల కుండీలో పేలుడు సంభవించినట్లు తెలిపారు.
పేలుడులో ఎవరికీ గాయాలు కాలేదని ఫైర్ అధికారి టీవీ9తో చెప్పారు. నాలుగైదు కార్లు మాత్రమే ధ్వంసమైనట్లు వివరించారు.
Also Read:
Madanapalle double murder: మదనపల్లె మర్డర్స్.. తిరుపతి రుయాకు నిందితులు.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?