Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడిస్తోంది ఒక భామ.. ఇది వందరోజుల బొమ్మ! బంగారం కేసులో తవ్వేకొద్దీ సింగారం..!

బెంగళూర్‌ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడును పెంచాయి. ఓవైపీ సీబీఐ , మరోవైపు కర్నాటక సీఐడీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. రన్యా రావు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ మొత్తం గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో రన్యాకు సహకరించినవారు ఎవరు? ఇప్పుడు ఇదే పాయింట్‌ మీద సీబీఐ కూపీ లాగుతోంది. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ తనిఖీల సమయంలో రన్యారావుకు సహకరించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ సహా అమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై కూడా దర్యాప్తు సంస్థలు ఫోకస్‌ చేశాయి.

ఆడిస్తోంది ఒక భామ.. ఇది వందరోజుల బొమ్మ! బంగారం కేసులో తవ్వేకొద్దీ సింగారం..!
Ranya Rao Gold Smuggling Case
Follow us
Balaraju Goud

| Edited By: Venkata Chari

Updated on: Mar 18, 2025 | 10:41 PM

రన్యారావు.. అమ్మాయి బాగుందని..ముచ్చటపడేరు. ఖతర్నాక్ లేడీ. అమ్మాయి హీరోయిన్ కదాఅని జాలిపడేరు.. .పక్కా ఫోర్‌ట్వంటీ. ఇప్పడీ బంగారు తల్లి పేరు దేశం మొత్తం మార్మోగుతోంది. గోల్డ్ స్మగ్లింగ్‌ స్కూల్‌లో కొత్త పాఠాలు నేర్చుకుని.. కిలోల లెక్కన బంగారాన్ని చాలా పకడ్బందీగా.. పద్దతిగా తరలిస్తూ కోట్లు వెనకేసుకుని కూర్చుంది. దొంగ బంగారాన్ని దొర వేషంలో దొంగచాటుగా చేరవేయడంలో ఎన్ని డిగ్రీ పట్టాలు తీసుకుందో కానీ.. కాళ్ల పట్టీల దగ్గర నుంచి నుదుటి పాపటి దాకా పసిడిని ఒడిసి పట్టిదంంటే తస్సాదియ్యా మానవుడి కంటికి కనిపించదు. AI టెక్నాలజీ కెమెరాకు చిక్కదు. అంతటి కిలాడీ.. ఈ కిలేడి..! మార్చి 3వ తేదీన ఏ ముహూర్తాన బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిందో కానీ.. ఈ సింగారమ్మ గోల్డ్‌ దెబ్బకు ఇప్పుడు కర్నాటక రాజకీయ కూసాలు కదిలిపోతున్నాయి. అసలే కన్నడ పాలిటిక్స్ ఎంత ఇంపుగా ఉంటాయో అందరికి తెలుసు. ఎక్కడ ఏ దగుల్బాజీ దందా జరిగినా.. దానికి అక్కడి పాలిటిక్స్‌కు లింకయి సింకై.. రచ్చ రచ్చ చేస్తుంటాయి. ఇప్పుడదే జరుగుతోందక్కడ. పోనీ అక్కడ దాకా ఆగిందా అంటే.. ఐపీఎస్‌ ఆఫీసర్ల దాకా పాకింది. ప్రొటోకాల్ రగడ అంటుకుంది. పోనీ అంతటితో ఆగిందా అనుకుంటే..చివరకు మన టాలీవుడ్ కొంపకూ నిప్పు అంటుకుంది. తరుణ్ రాజ్ కొండూరు అట. పాపం ఈ పిలకాయ పరిచయం అనే సినిమాతో టాలీవుడ్‌ జనాలకు పరిచయం అయ్యాడు. తర్వాత పత్తాలేకుండా పోయాడు. చివరికి రన్యారావు పణ్యమా అని...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి