Rana Daggubati: రానా ఒక్కడికే అదెలా సాధ్యమవుతుందబ్బా ?? ప్రతి దాని మీద మనోడి ముద్ర ఉండాల్సిందే
సినిమాలతో పాటు బిజినెస్ చేయడానికి.. సినిమాలతోనే బిజినెస్ చేయడానికి చాలా తేడా ఉంది. ప్రస్తుతం రానా దగ్గుబాటి ఇదే చేస్తున్నారు. అసలు కంటే కొసరు నయమన్నట్లు.. నటన కంటే నిర్మాణం, బిజినెస్‌పైనే రానా ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటి..? ఇకపై ఈయన హీరోగా సినిమాలు చేయరా..? తాజాగా ఆయన షురూ చేసిన బిజినెస్ ఏంటి..?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Mar 18, 2025 | 9:34 PM

సినిమాలతో పాటు బిజినెస్ చేయడానికి.. సినిమాలతోనే బిజినెస్ చేయడానికి చాలా తేడా ఉంది. ప్రస్తుతం రానా దగ్గుబాటి ఇదే చేస్తున్నారు. అసలు కంటే కొసరు నయమన్నట్లు.. నటన కంటే నిర్మాణం, బిజినెస్‌పైనే రానా ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటి..? ఇకపై ఈయన హీరోగా సినిమాలు చేయరా..? తాజాగా ఆయన షురూ చేసిన బిజినెస్ ఏంటి..?

రానా దగ్గుబాటి.. ట్రూ ఆల్‌రౌండర్ ఆఫ్ టాలీవుడ్. నటిస్తాడు.. నిర్మిస్తాడు.. విజువల్ ఎఫెక్ట్స్‌లో ప్రవేశం ఉంది.. క్యాస్టింగ్ కంపెనీ ఉంది.. హోస్ట్ చేస్తాడు.. డిస్ట్రిబ్యూట్ చేస్తాడు.. బిజినెస్‌లో ఆరితేరిపోయాడు.. వాట్ నాట్ అన్నిట్లో తన మార్క్ చూపించారు రానా దగ్గుబాటి.

నటన కంటే ఎక్కువగా ఈ మధ్య బిజినెస్ వైపు అడుగులేస్తున్నారు రానా. లీడర్ నుంచి నిన్నమొన్నటి వేట్టయాన్ వరకు ఎక్కడా ఇమేజ్ చట్రంలో ఇరుక్కోలేదు రానా.

నటనతో పాటు ప్రొడక్షన్‌లోనూ బిజీగానే ఉన్నారు. కేరాఫ్ కంచెరపాలెం, 777 చార్లి, 35 లాంటి సినిమాలను విడుదల చేసింది ఈ నటుడే. మరోవైపు రానా నాయుడు లాంటి సిరీస్‌లు.. నెంబర్ వన్ యారీ, ది రానా దగ్గుబాటి షో లాంటి టాక్ షోలతో డిజిటల్‌గానూ రప్ఫాడించారు రానా.

కొన్నేళ్లుగా నటనకు గ్యాప్ ఇస్తూ వస్తున్నారు రానా. అదేంటని అడిగితే.. మంచి కథ వస్తేనే చేస్తా కంగారేం లేదంటున్నారు. తాజాగా భార్య మిహీకతో కలిసి ఫుల్ స్టోరీస్ పేరుతో ఫుడ్ బిజినెస్‌లోకి అడుగు పెట్టారు రానా. మొత్తానికి ఎక్కడ చూసినా.. అక్కడ తన హ్యాండ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారీయన. అందుకే ఆయన్ని ట్రూ ఆల్‌రౌండర్ అనేది.