Madanapalle double murder: మదనపల్లె మర్డర్స్.. తిరుపతి రుయాకు నిందితులు.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?
మదనపల్లె జంట హత్యల కేసు ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. బిడ్డలను దారుణంగా చంపిన తల్లిదండ్రులను

Madanapalle double murder: మదనపల్లె జంట హత్యల కేసు ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. బిడ్డలను దారుణంగా చంపిన తల్లిదండ్రులను తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కూతుళ్లను మూఢభక్తితో చంపేసిన కేసులో నిందితులు పద్మజ, పురుషోత్తంనాయుడులకు న్యాయమూర్తి ఐదురోజుల క్రితం 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.
అయితే, వారు అక్కడ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉండటంతో .. తిరుపతి రుయా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాలని రెండు రోజుల క్రితం జైలు అధికారులకు డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో కోర్టు అనుమతి తీసుకున్న పోలీసులు.. శుక్రవారం ఉదయం నిందితులను జైలు నుంచి చిత్తూరు ఏఆర్ సిబ్బంది భద్రత నడుమ తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఓపీ అనంతరం వారిద్దరినీ హాస్పిటల్‌లోని సైకియాట్రీ వార్డుకు తరలించారు. నిందితుల ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ భారతి ఎంక్వైరీ చేశారు. పూర్తిస్థాయి మెడికల్ టెస్టులు నిర్వహించిన అనంతరం నిందితులకు ట్రీట్మెంట్ అందించాలా లేక మరో చోటికి రిఫర్ చేయాలా అనే అంశాన్ని చెప్పగలమన్నారు.
Also Read: