AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EDLI Scheme: వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే..!

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ ఉద్యోగులకు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసా అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రావిండెంట్ స్కీమ్‌ను అమలు చేస్తుంది. కానీ పీఎఫ్ ఖాతాదారుల సంక్షేమమే ధ్యేయంగా ఈపీఎఫ్ఓ చందాదారులకు ప్రత్యేక ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఉందని చాలా మందికి తెలియదు. పీఎఫ్ ఖాతాదారులకు అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

EDLI Scheme: వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే..!
Edli Scheme
Nikhil
|

Updated on: Mar 17, 2025 | 9:35 PM

Share

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ అంటే యజమానులు, ఉద్యోగులు ఇద్దరూ విరాళంగా ఇచ్చే పదవీ విరమణ పథకంగా అందరూ భావిస్తారు. ఈపీఎఫ్ఓ స్కీమ్ గణనీయమైన పదవీ విరమణ కార్పస్‌ను అందిస్తుంది. అయితే ఈపీఎఫ్ అంటే బీమా పథకం అనే విషయంలో చాలా మందికి తెలియదు. నెలవారీ చందా చెల్లించే సభ్యుడు వారి సర్వీస్ మధ్యలో మరణిస్తే కుటుంబ సభ్యులు/నామినీ/చట్టపరమైన వారసుడికి ఈపీఎఫ్ఓ ​​రూ. 7 లక్షల వరకు బీమాను అందిస్తుంది. 1976లో కేంద్ర ప్రభుత్వం క్రియాశీల ఈపీఎఫ్ ఖాతాదారుల కుటుంబ సభ్యులకు బీమా ప్రయోజనాలను అందించడం ప్రారంభించింది.

భారతదేశం అంటే యజమాని ఆధారంగా నడిచే కుటుంబ వ్యవస్థ. అయితే అనుకోని సందర్భంలో యజమాని మరిణిస్తే, ఒకవేళ అతడు ఉద్యోగం చేస్తున్నప్పుడు మరణిస్తే ఈపీఎఫ్ఓ వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించడానికి ఈడీఎల్ఐ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈడీఎల్ఐ బీమా మొత్తం రూ. 7 లక్షల వరకు ఉంటుంది. ఇది ఉద్యోగి మరణానికి ముందు చివరి 12 నెలల్లో పొందిన జీతంపై ఆధారపడి ఉంటుంది. ఈడీఎల్ఐ పథకం కింద క్లెయిమ్ మొత్తం గత 12 నెలల్లో సగటు నెలవారీ జీతం కంటే 35 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ అది రూ. 7 లక్షలకు మించకూడదు. ఈ పథకం కింద కనీస ప్రయోజన మొత్తం రూ. 2.50 లక్షలుగా ఉంటుంది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర నిబంధనల చట్టం, 1952 కింద నమోదు చేయబడిన అన్ని సంస్థలు ఆటోమెటిక్‌గా ఈడీఎల్ఐ అర్హత పొందుతాయి. వారు ఈ పథకానికి సభ్యత్వాన్ని పొందడంతో పాటు కనీసం రూ. 15,000 మూల వేతనంతో తమ ఉద్యోగులను నమోదు చేసుకోవడం తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఈడీఎల్ఐ స్కీమ్‌కు దరఖాస్తు చేయడానికి ప్రత్యేక పద్ధతి అంటూ ఏమీ ఉంటుంది. ఈపీఎఫ్ చందాదారులకు ఆటోమెటిక్‌గా ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈడీఎల్ఐ స్కీమ్‌కు  యజమాని మాత్రమే ఉద్యోగి ప్రాథమిక జీతంలో 0.5 శాతం (గరిష్టంగా రూ. 75 వరకు) చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..