AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Savings: ఆ పథకాల్లో పెట్టుబడితో పన్ను బాదుడికి చెక్.. మరో 15 రోజులే గడువు

భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆదాయపు పన్ను చెల్లింపుల్లో కొంత భాగాన్ని పొదుపు చేయడం ద్వారా మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని కొన్ని సెక్షన్ల ఆధారంగా పెట్టుబడి పథకాల్లో పెట్టుబడితో మినహాయింపులను పొందవచ్చు.

Tax Savings: ఆ పథకాల్లో పెట్టుబడితో పన్ను బాదుడికి చెక్.. మరో 15 రోజులే గడువు
Tax Savings
Nikhil
|

Updated on: Mar 16, 2025 | 4:57 PM

Share

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 మార్చి 31న ముగియనుంది. ఐటీఆర్ సీజన్ 2025 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. పాత పన్ను విధానంలో 2025 ఆర్థిక సంవత్సరానికి కొంత ఆదాయపు పన్ను ఆదా చేసేలా ఎన్‌పీఎస్, ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్ వంటి పన్ను ఆదా సాధనాలలో పెట్టుబడి పెట్టడానికి పన్ను చెల్లింపుదారులకు మార్చి 31 వరకు దాదాపు 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టంలోకి కొన్ని సెక్షన్ల వివరించిన పెట్టుబడి పథకాల్లో పెట్టుబడితో భారీగా పన్ను ఆదా చేయవచ్చు. ఆ చట్టాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

సెక్షన్ 80సీ

సెక్షన్ 80సీ అనేది అత్యంత విస్తృతంగా ఉపయోగించే పన్ను ఆదా మార్గం. ఇది ఒక ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు తగ్గింపులను అనుమతిస్తుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, జాతీయ పొదుపు ధ్రువీకరణ పత్రం (ఎన్ఎస్‌సీ), ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్, జీవిత బీమా ప్రీమియంలు, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల్లో పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా చేయవచ్చు. 

సెక్షన్ 80డీ

ఈ సెక్షన్ ద్వారా ఆరోగ్య బీమా ప్రీమియంలను చెల్లించే ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. పర్సనల్, కుటుంబం, తల్లిదండ్రుల వైద్య బీమా కోసం చెల్లించే ప్రీమియంలపై ఆదాయపు పన్ను మినహాయింపులు ఇస్తారు. పర్సనల్, భార్య, పిల్లలకు రూ. 25,000. తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే రూ. 50,000, అలాగే ఆరోగ్య పరీక్షల కోసం అదనంగా రూ. 5,000 మినహాయింపు ఇస్తారు. 

ఇవి కూడా చదవండి

సెక్షన్ 80ఈ

విద్యా రుణాలపై చెల్లించే వడ్డీపై కూడా ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలపై చెల్లించే వడ్డీని పూర్తిగా తగ్గించవచ్చు. తగ్గింపు మొత్తానికి పరిమితి లేదు, కానీ తిరిగి చెల్లింపు ప్రారంభం నుంచి 8 సంవత్సరాల వరకు ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.

సెక్షన్ 80ఈఈ, 80ఈఈఏ

గృహ రుణ వడ్డీ చెల్లింపుపై కూడా పన్ను మినహాయింపులను పొందవచ్చు. సెక్షన్ 80 ఈఈ ద్వారా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి గృహ రుణ వడ్డీపై రూ. 50,000 అదనపు మినహాయింపు పొందవచ్చు. 80 ఈఈఏ ద్వారా సరసమైన గృహ రుణాలకు రూ. 1.5 లక్షల అదనపు మినహాయింపు పొందవచ్చు. 

సెక్షన్ 80జీ

ధార్మిక సంస్థలకు ఇచ్చే విరాళాలపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. అర్హత కలిగిన దాతృత్వ సంస్థలు, సహాయ నిధులకు ఇచ్చే విరాళాలు తగ్గింపులకు అర్హత పొందుతాయి. కొన్ని విరాళాలు 100 శాతం తగ్గింపునకు అర్హత  ఉంటే మరికొన్ని 50 శాతం మినహాయింపుకు అనుమతిస్తాయి.

సెక్షన్ 80 జీజీ

 మీ హెచ్ఆర్ఏ జీతంలో భాగం కాకపోతే చెల్లించిన అద్దెపై మినహాయింపు వస్తుంది.  సంవత్సరానికి రూ. 60,000 లేదా మొత్తం ఆదాయంలో 25శాతం గరిష్టంగా మినహాయింపు పొందవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి