- Telugu News Photo Gallery Business photos Amazing returns on FDs in three years, The best are the three banks, Fixed Deposits details in telugu
Fixed Deposits: మూడేళ్లల్లో ఎఫ్‌డీలపై ముచ్చటైన రాబడి.. ది బెస్ట్ మూడు బ్యాంకులివే..!
ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది మీకు స్థిరమైన రాబడిని ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి. ఎఫ్‌డీల్లో ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు స్వల్ప లేదా దీర్ఘకాలిక కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఎంత పెట్టుబడి పెడతారు? ఎంతకాలం పెట్టుబడి పెడతారు? అనే దానిపై మీరు సంపాదించే వడ్డీ ఆధారపడి ఉంటుంది. ఎఫ్‌డీలపై వడ్డీ రాబడిని ప్రతి నెలా, ప్రతి 3 నెలలకు, ప్రతి 6 నెలలకు, ప్రతి సంవత్సరం, లేదా పెట్టుబడి ముగిసినప్పుడు ఒకేసారి ఎంచుకునే సదుపాయం ఉంది. సాధారణ, సీనియర్ సిటిజన్లు రూ. 8 లక్షలను మూడు ప్రధాన బ్యాంకుల్లో పెట్టుబడి పెడితే రాబడి ఎంత వస్తుంది? అనే విషయాన్ని ఓ సారి తెలుసుకుందాం.
Srinu |
Updated on: Mar 16, 2025 | 5:52 PM

ఎస్‌బీఐ సాధారణ పౌరులకు వడ్డీ రేటు 6.75 శాతం ఇస్తుంటే సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 7.25 శాతం వడ్డీ ఇస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్యాంక్ ప్రస్తుతం తన 3 సంవత్సరాల ఎఫ్‌డీపైపై సాధారణ పౌరులకు 7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

బ్యాంకు ఆఫ్ బరోడా సాధారణ పౌరులకు వడ్డీ రేటు 7.15 శాతం వడ్డీ ఇస్తుంటే సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీ ఇస్తుంది.

ఎస్‌బీఐ రూ. 8లక్షల పెట్టుబడిపై సాధారణ పౌరులకు 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో అంచనా వేసిన మెచ్యూరిటీ మొత్తం రూ. 9,77,914గా ఉంది. అంటే రాబడి రూ. 1,77,914. సీనియర్ సిటిజన్లకు 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో అంచనా వేసిన మెచ్యూరిటీ మొత్తం రూ. 9,92,438గా ఉంటుంది. అంటే రాబడి రూ. 1,92,438గా ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.8 లక్షల పెట్టుబడిపై అంచనా వేసిన మెచ్యూరిటీ మొత్తం రూ. 9,85,151 ఉంది. అంటే మూడేళ్లల్లో రాబడి రూ. 1,85,151. సీనియర్ సిటిజన్లకు అంచనా వేసిన మెచ్యూరిటీ మొత్తం రూ. 9,99,773గా ఉంటే రాబడి రూ. 1,99,773గా ఉంది.

బ్యాంకు ఆఫ్ బరోడాలో రూ.8లక్షల పెట్టుబడిపై అంచనా వేసిన మెచ్యూరిటీ మొత్తం రూ. 9,89,517గా ఉంది. అంటే రాబడి రూ. 1,89,517గా ఉంది. అలాగే సీనియర్ సిటిజన్లకు మెచ్యూరిటీ మొత్తం రూ. 10,04,198గా ఉంది. అంటే అంచనా వేసిన రాబడి రూ. 2,04,198గా ఉంది.





























