- Telugu News Photo Gallery Technology photos These phones have no competition when it comes to charging, These are the best phones, Smart Phones details in telugu
Smart Phones: చార్జింగ్‌లో విషయంలో ఈ ఫోన్స్‌కు నో పోటీ.. ది బెస్ట్ ఫోన్స్ ఇవే..!
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ పనితీరు అనేది కచ్చితంగా బ్యాటరీ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. దీంతో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు బ్యాటరీ టెక్నాలజీని చురుగ్గా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అధిక సామర్థ్యం, వేగవంతమైన ఛార్జింగ్‌తో పాటు ఎక్కువ లైఫ్‌పై దృష్టి సారిస్తున్నారు. బ్యాటరీ లైఫ్ అనేది ఫోన్ కొనుగోలు విషయంలో కీలక పాత్రం పోషిస్తుంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో బ్యాటరీ లైఫ్ విషయంలో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేద్దాం.
Srinu |
Updated on: Mar 16, 2025 | 3:10 PM

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ ధర రూ. 29,999గా ఉంది. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 125 వాట్స్ టర్బోపవర్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఒకే ఛార్జ్‌పై బ్యాటరీ లైఫ్ 40 గంటల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఎడ్జ్ 50 ప్రోలో 6.7 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసీ ద్వారా శక్తి నిస్తుంది, 12 జీబీ ర్యామ్‌తో వచ్చే ఈ ఫోన్ 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఆకర్షిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ 4 100 వాట్స్ సూపర్ వీఓఓసీ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఆకర్షిస్తుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ మెటల్ యూనిబాడీ డిజైన్‌తో 120 హెచ్‌జెడ్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఓఐఎస్ మద్దతుతో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్ ధర రూ. 28,999గా ఉంది.

పోకో ఎక్స్7 ప్రో ఫోన్‌ను రూ. 25,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ భారీ 6,550 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ ఒక గంటలోపు పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అలాగే కేవలం 34 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.

రియల్ మీ జీటీ 6టీ ఫోన్ రూ. 27,999కు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ప్లస్ జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే ఇన్‌బిల్ట్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీను కేవలం 32 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేసేలా 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును పొందుతుంది. జీటీ 6టీ 6.78 అంగుళాల 8టీ ఎమోఎల్ఈడీ ప్యానెల్‌తో వస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

పోకో ఎఫ్-6 ఫోన్ రూ. 29,990కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 90 వాట్స్ టర్బో ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 6.67 అంగుళాల క్రిస్టల్ రెస్ ఫ్లో ఎమోఎల్ఈడీ ప్యానెల్, 50 ఎంపీ కెమెరా సిస్టమ్, 20 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వచ్చే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎస్ జెన్-3 ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తుంది.





























