టీవీ షోలు మానేస్తోన్న జబర్దస్త్ వర్ష! కారణమదేనా?

18 March 2025

Basha Shek

కెరీర్ ఆరంభంలో సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ  పాపులారిటీ తెచ్చుకున్న వర్ష జబర్దస్త్ లోకి వచ్చాక బాగా ఫేమస్ అయింది

జబర్దస్త్ వేదికలపై ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ చేసే కామెడీ, లవ్ ట్రాక్స్  ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.

బుల్లితెరపై సుధీర్ – రష్మీల జోడీ తర్వాత  ఆ రేంజ్ లో ఫేమస్ అయ్యింది వర్ష – ఇమ్మాన్యుయేల్ జోడీనే అని చెప్పవచ్చు

ప్రస్తుతం వర్ష జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, పలు టీవీ ప్రోగ్రామ్స్ లలో కనిపిస్తూ బుల్లితెర ఆడియెన్సను అలరిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ చేసిన టీవీ షో ప్రోమోలో.. యాంకర్ రష్మీ వర్షని ఇదే ఇమ్ముతో నీ చివరి పర్ఫార్మెన్స్ అనుకోవచ్చా? అని అడిగింది

దీంతో ఎమోషనల్ అయిన వర్ష..  ఇమ్ము.. ఇక్కడ ఎంతమంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు అంటూ వెళ్లి అతనిని హగ్ చేసుకొని ఏడ్చేసింది.

దీంతో వర్ష టీవీ షోలు మానేస్తుందా? లేక జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మానేస్తుందా అని బుల్లితెర ఆడియెన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో ఇమ్మాన్యుయేల్ మానేస్తున్నాడా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రోమోపై త్వరలోనే ఫుల్ క్లారిటీ రానుంది.