Indian Railways: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. 31 రైల్వే స్టేషన్లు మూసివేత..! ఎందుకంటే?

భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం లేని కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను..

Indian Railways: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. 31 రైల్వే స్టేషన్లు మూసివేత..! ఎందుకంటే?
Follow us

|

Updated on: Jan 29, 2021 | 6:12 PM

Railway Stations Temporarily Closed: భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం లేని కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా స్టేషన్ల పరిధిలో ఆదాయం, రద్దీ లేని కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 29 స్టేషన్లు మూతబడుతుండగా.. ఏప్రిల్ 1 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూతబడుతాయని అధికారులు శుక్రవారం వెల్లడించారు. అయితే ఈ స్టేషన్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఒక్క స్టేషన్ మాత్రం మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్‌ పరిధిలో ఉంది.

డివిజన్ల వారీగా.. సికింద్రాబాద్ పరిధిలో 16, గుంతకల్ పరిధిలో 3, నాందేడ్ పరిధిలో 1, గుంటూరులో 4, హైదరాబాద్ 7 స్టేషన్లను మూసివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అకస్మాత్తుగా 31స్టేషన్లను మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయంపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read: