Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Mohan Naidu Kinjarapu: పితృత్వ సెల‌వులు కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు

తెలుగుదేశం నాయకుడు, శ్రీ‌కాకుళం ఎంపీ కింజారపు రామ్మోహ‌న్ నాయుడు పితృత్వ సెలవులు కావాల‌ని కోరుతూ...

Ram Mohan Naidu Kinjarapu: పితృత్వ సెల‌వులు కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 29, 2021 | 5:45 PM

Ram Mohan Naidu Kinjarapu: తెలుగుదేశం నాయకుడు, శ్రీ‌కాకుళం ఎంపీ కింజారపు రామ్మోహ‌న్ నాయుడు పితృత్వ సెలవులు కావాల‌ని కోరుతూ లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. వ‌చ్చే వారం త‌న భార్య బిడ్డకు జన్మనివ్వనుందని.. ఇలాంటి పరిస్థితుల్లో తన వెంట ఉండాలని కోరుకుంటున్నానంటూ రామ్మోహన్ నాయుడు స్పీకర్‌కు లేఖలో వివరించారు. శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపధ్యంలో ఆయన సెలవులు కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. ఒక బాధ్యతాయుతమైన భర్తగా, తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నానని జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు తొమ్మిది రోజులపాటు సెలవు మంజూరు చేయాలని కింజారపు కోరారు.

తన భార్య శ్రావ్య రాబోయే వారంలో ఎప్పుడైనా బిడ్డకు జన్మనిచ్చే అవకాశముందని.. ప్రస్తుతం, బిడ్డకు జన్మనిచ్చాక ఆమెకు తోడుండాలని కోరుకుంటున్నాని రామ్మోహన్ నాయుడు వివరించారు. కాగా.. కింజారపు రామ్మోహన్ నాయుడు 2017 జూన్‌లో మాజీ మంత్రి బండారు సత్యన్నారయణ మూర్తి కూతురు శ్రావ్యను పెళ్లి చేసుకున్నారు.

Also Read:

AP Panchayat Elections 2021 Nominations Live Updates: పల్లెల్లో మోగిన నగారా.. నేటి నుంచి తొలి ఘట్టం షురూ..

Central Govt: దేశంలోని ఐదురాష్ట్రాలకు విపత్తు సాయం ప్రకటించిన కేంద్రం.. తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించారంటే..