Bahubali: ‘మహేంద్ర బాహుబలి’ ఇప్పుడు ఎలా మారాడో చూశారా..? వైరల్‌గా మారిన ఫొటోలు..
Bahubali Kid Photo Viral: ప్రభాస్ ప్రధాన పాత్రలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ రికార్డులను..
Bahubali Kid Photo Viral: ప్రభాస్ ప్రధాన పాత్రలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది. ఇక ఈ సినిమాలో కనిపించిన అన్ని పాత్రలు సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే సినిమా ప్రారంభంలో శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ నీటి ప్రవాహంలో ఓ చిన్నారిని పైకెత్తి.. ‘మహేంద్ర బాహుబలి బతకాలి’ అనే డైలాగ్ చెబుుతుంది. ఆ చిన్నారి పాత్ర గుర్తుంది కదూ.. అప్పట్లో ఆ చిన్నారి బాగా పాపులర్ అయింది. అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికే సుమారు 5 ఏళ్లు గడుస్తోంది. మరి ఇప్పుడా చిన్నారి ఎలా ఉందో తెలుసుకోవాలనుందా.? అయితే సినిమాలో మహేంద్ర బాహుబలిగా చూపించిన ఆ చిన్నారి బాబు కాదు, పాప. తన పేరు తన్వి.. ప్రస్తుతం ఆ పాప.. యూకేజీ చదువుతోంది. తాజాగా తన్వి ఫొటోను ప్రముఖ జర్నలిస్టు.. దొంతు రమేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ పాప ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
బాహుబలి సినిమాలో కట్టప్ప ఎత్తుకున్న ఈ పాప(మహేంద్ర బాహుబలి) ఇప్పుడు యూకేజీ చదువుతుంది. పేరు తన్వి. @ssrajamouli pic.twitter.com/Aj31XvG6EB
— DONTHU RAMESH (@DonthuRamesh) January 27, 2021
Also Read: Prabhas : రామగుండం కమిషనర్ కార్యాలయంలో ప్రభాస్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..