Prabhas : రామగుండం కమిషనర్ కార్యాలయంలో ప్రభాస్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..
కేజీఎఫ్ తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్ కోసం హీరోలు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్ 2ను తెరకెక్కించే పనిలో ఉన్న ప్రశాంత్..

Prabhas : ‘కేజీఎఫ్’తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్ కోసం హీరోలు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్ 2ను తెరకెక్కించే పనిలో ఉన్న ప్రశాంత్ ఆతర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాను చేయనున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరుపుకుంది. మరో వైపు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్ గౌడ, సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ మాఫియా లీడర్ గా కనిపించనున్నాడని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తుంది. ఇక ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఇంతవరకు ఏ హీరోకు లేని విధంగా డిజైన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. తాజాగా ప్రభాస్ రామగుండం రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ (డి.ఐ. జి) డాక్టర్ వి. సత్యనారాయణను శుక్రవారం కలిశారు. ‘సలార్’ సినిమా రామగిరి మండలం ఓసీపీ-2లో షూటింగ్ జరుపుకుంటోంది. బొగ్గు గని ప్రాంతంలో ఫైట్ సీన్లను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు దగ్గర ఓ సెట్టింగ్ ను వేసింది చిత్రయూనిట్. పది రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరగనుందట. ప్రభాస్ సీపీ కార్యాలయానికి రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు పేద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :