Ravi Teja ‘Khiladi’ : శరవేగంగా ఖిలాడి షూటింగ్.. మాస్ రాజా కోసం విలన్ గా యాక్షన్ కింగ్

యాక్షన్ కింగ్ అర్జున్ ఇటీవల పలు సినిమాల్లో కీలక పాత్రలో, విలన్ పాత్రల్లో నటించి మెప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అర్జున్ మరో సారి విలన్ గా మారారు అదికూడా మాస్ రాజా రవితేజ సినిమాలో

Ravi Teja 'Khiladi' : శరవేగంగా ఖిలాడి షూటింగ్.. మాస్ రాజా కోసం విలన్ గా యాక్షన్ కింగ్
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 29, 2021 | 2:01 PM

Ravi Teja ‘Khiladi’ : యాక్షన్ కింగ్ అర్జున్ ఇటీవల పలు సినిమాల్లో కీలక పాత్రలో, విలన్ పాత్రల్లో నటించి మెప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అర్జున్ మరో సారి విలన్ గా మారారు అదికూడా మాస్ రాజా రవితేజ సినిమాలో. ప్రస్తుతం రవితేజ క్రాక్ మూవీ ఇచ్చిన కిక్ తో ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేస్తున్నాడు. బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు రమేష్ వర్మతో ఈ సినిమా చేస్తున్నాడు రవితేజ. గతంలో విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆతర్వాత రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి చెందిన గ్లింప్స్ విడుదల చేశారు. తాజాగా  ఈ సినిమాలో విలన్ గా అర్జున్ ను ఎంపిక చేశాడు దర్శకుడు. భారీ ఎత్తున అంచనాలున్న ఖిలాడి సినిమా చిత్రీకరణలో యాక్షన్ కింగ్ అర్జున్ జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం రవితేజ మరియు అర్జున్ ల కాంబోలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ డ్రామా ఖిలాడి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్  సంగీతం అందించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Prabhas : రామగుండం కమిషనర్ కార్యాలయంలో ప్రభాస్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..

మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం