సలార్ నటుడికి భారీ ఆఫర్.. అజిత్ నయా మూవీలో చిన్నప్పటి వరదరాజ మన్నార్
తమిళ్ స్టార్ హీరో అజిత్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాయి. ఇక తమిళనాట ఆయన క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు పూనకాలతో ఊగిపోతారు.

ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు ఆరేళ్ళ తరువాత ప్రభాస్ భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక యాక్షన్ ఎంటర్టైనర్ గా అదరగొట్టిన ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటించిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉంటే సలార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్ననాటి పాత్రలో నటించిన కుర్రాడు గుర్తున్నాడా.?
సలార్ సినిమాలో యువ రాజు వరద రాజా మన్నార్ పాత్ర పోషించిన నటుడి పేరు కార్తికేయ దేవ్. ఈ కుర్రాడు తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కార్తికేయకు ఓ భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. ఈ బాల నటుడు ఇప్పుడు అజిత్ కుమార్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీతో తమిళ సినిమాలోకి అడుగుపెడుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ విషయాన్నీ పంచుకున్నారు. ఈ చిత్రంలో అజిత్ కుమార్ కొడుకుగా సలార్ నటుడు కార్తికేయ నటిస్తున్నాడు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కూడా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తండ్రీ కొడుకుల భావోద్వేగ బంధం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి ప్రధాన హైలైట్లలో ఒకటిగా ఉంటుందని అన్నారు. ఈ మూవీ కుటుంబ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని అన్నారు.
2023లో ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సలార్ చిత్రంలో తన పాత్ర ద్వారా కార్తికేయ దేవ్ అభిమానులలో క్రేజ్ తెచ్చుకున్నాడు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించి, నటుడు మోహన్ లాల్ నటించిన ‘ఎల్2: ఎంబురాన్’ చిత్రంలో కార్తికేయ దేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రం మార్చి 28, 2025న విడుదలకానుంది. కార్తికేయ దేవ్ ప్రస్తుతం టక్ టక్ సినిమాలో చేస్తున్నాడు . ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించిన టక్ టక్ చిత్రంలో హర్ష్ రోషన్, సాన్వే మేఘన, స్టీవెన్ మధు, నిహాల్ గోదాతి కీలక పాత్రల్లో నటించారు. సలార్ సినిమా తర్వాత, కార్తికేయ దేవ్ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఏప్రిల్ 10, 2025న థియేటర్లలో విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..