TS Inter Exams 2021: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రద్దు.. అధికారికంగా ప్రకటించిన మంత్రి సబిత
తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఫలితాలకు సంబంధించి త్వరలోనే విధివిధానాలను రూపొందిస్తామని ఆమె చెప్పారు.
తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఫలితాలకు సంబంధించి త్వరలోనే విధివిధానాలను రూపొందిస్తామని ఆమె చెప్పారు. కమిటీ వేశామని, కమిటీ నిర్ణయం మేరకు ఫలితాలు వెల్లడిస్తామని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
అయితే ఈ ఉదయం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండించిన విద్యాశాఖ మంత్రి అప్పుడే స్పష్టత ఇచ్చారు. అధికారులతో సమీక్ష జరిపి చర్చించిన అనంతరం పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను కూడా ఏప్రిల్‌లో రద్దు చేశారు. ఆ తర్వాత గ్రేడింగ్ విధానం ద్వారా విద్యార్థులను పాస్ చేశారు. ఇప్పుడు కూడా అదే విధానంలో విద్యార్థులను పాస్ చేస్తారేమో చూడాలి. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇంటర్ సెకండియర్‌కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులను ప్రకటిస్తారని అనుకుంటున్నారు.
ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.