AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponguleti Srinivas Reddy: కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి.. సమస్యలు చెప్పుకున్న రైతులు!

ఎప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపే ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడూ పల్లెల్లో రైతులతో కలిసి కాసేపు సరదాగా గడుపుతుంటారు. ఇలానే రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సైతం తన పర్యటనలో భాగంగా రైతులతో ముచ్చటించాడు. కాన్వాయ్‌ దిగి పంటపొలాల్లోకి వెళ్లి కాసేపు వాళ్లతో సరదాగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు.

Ponguleti Srinivas Reddy: కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి.. సమస్యలు చెప్పుకున్న రైతులు!
Ponguleti Srinivas Reddy
N Narayana Rao
| Edited By: |

Updated on: Jul 14, 2025 | 6:08 PM

Share

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉండే ఆయన తన పర్యటనలో కాసేపు రైతులు, కూలీలతో ముచ్చటించారు. కాన్వాయ్‌ దిగి పంట పొలాల్లోకి వెళ్లారు. సాగు చేస్తున్న పెసర పంటను సందర్శించి, రైతులతో మాట్లాడారు. పంటల పెంపకం, సాగు పరిస్థితులు, సాగునీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరి నాటు కూలీలను కలసి, వారి జీవన స్థితిగతులపై ఆరాతీశారు. మహిళా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు రోజువారీ వేతనాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పంట స్థితిగతుల పరిశీలనతో పాటు పల్లె జీవన వ్యవస్థపై అవగాహన పెంచుకునే ప్రయత్నం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు బంధు, వంటి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడంమే ముఖ్య లక్ష్యమని ఆయన తెలిపారు.  ఇక స్వయంగా మంత్రి తమ దగ్గరకు వచ్చి మాట్లాడటంతో కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.

మంత్రి పొలాన్ని సందర్శించిన వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us