KTR: విజయవంతంగా ముగిసిన కేటీఆర్‌ దావోస్‌ పర్యటన.. రాష్ట్రానికి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు వెల్లడి

పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా జ‌రిగిన 2023 ప్రపంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సు పర్యటన విజయవంతమైంది. 4 రోజుల్లో 52 బిజినెస్‌ మీటింగులు, 6 రౌండ్ టేబుల్ స‌మావేశాలు, 2 ప్యానెల్ చ‌ర్చలు జరిగాయి.

KTR: విజయవంతంగా ముగిసిన కేటీఆర్‌ దావోస్‌ పర్యటన.. రాష్ట్రానికి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు వెల్లడి
Ktr Davos Tour
Follow us

|

Updated on: Jan 22, 2023 | 6:48 AM

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ ప‌ర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి రూ.21వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు మంత్రి  తెలిపారు. ‘పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా జ‌రిగిన 2023 ప్రపంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సు పర్యటన విజయవంతమైంది. 4 రోజుల్లో 52 బిజినెస్‌ మీటింగులు, 6 రౌండ్ టేబుల్ స‌మావేశాలు, 2 ప్యానెల్ చ‌ర్చలు జరిగాయి. దావోస్ పర్యటన వేదికగా సంద‌ర్భంగా తెలంగాణ‌కు రూ. 21 వేల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు కేటీఆర్‌. కాగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రూ.16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో 2 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు దావోస్ వేదికగా ప్రకటించింది. అలాగే 2 వేల కోట్ల రూపాయలతో ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ డేటాసెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటుచేస్తున్నట్లు భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత ఔషధ పరిశోధన, తయారీ సంస్థ యూరోఫిన్స్ హైదరాబాద్ కేంద్రంగా భారతీయ మార్కెట్‌ను విస్తరిస్తామని ప్రకటించింది. ఇక లండన్ తరువాత హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ లిమిటెడ్‌ తెలిపింది.

ఇక 210 కోట్ల రూపాయల పెట్టుబడితో అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్నట్లు పెప్సికో ప్రకటించింది. ఇక రీహాబిలిటేషన్ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డిజిటల్ సేవలను అందించే వెబ్ పీటీ, 150 కోట్లతో హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పీఅండ్‌ జీ, అల్లాక్స్‌, ఇన్‌స్పైర్‌ బ్రాండ్స్‌ వంటి ఇతర అంతర్జాతీయ సంస్థలు వేల కోట్ల పెట్టుబడులు ప్రకటించినట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..