Telangana: ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ.. ఈసారైనా గవర్నర్ ప్రసంగం ఉండేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్‌ చేశారు. ఫిబ్రవరి మూడున సెషన్ ప్రారంభమవుతుంది. ఐదున బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈసారి కూడా గవర్నర్‌ ప్రసంగం లేకుండానే..

Telangana: ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ.. ఈసారైనా గవర్నర్ ప్రసంగం ఉండేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?
Cm Kcr Vs Governor Tamilsai
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 22, 2023 | 7:50 AM

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్‌ చేశారు. ఫిబ్రవరి మూడున సెషన్ ప్రారంభమవుతుంది. ఐదున బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈసారి కూడా గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయని చెప్తున్నారు. మరోవైపు బడ్జెట్‌ పద్దులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్.

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలకు సమయం ఆసన్నమైంది. వచ్చే నెల 3న మ‌ధ్యాహ్నం 12గంటల 10నిముషాలకు శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదో తేదీన సభలో బ‌డ్జెట్ ప్రవేశ‌పెడతారు. ఈ మేరకు అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాల‌పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు స‌మాచారం అందించారు.

తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ 2023-24 ప్రతిపాద‌న‌ల‌పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ స‌మావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. సుమారు 2.85 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల వరకు బడ్జెట్ ఉండొచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ ప్రసంగంలో గవర్నర్ ప్రసంగం ఉంటుందా.. లేదా.. అనేది ఆసక్తిగా మారింది. అయితే గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈసారి సమావేశాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి కారణం కూడా చెప్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్ని ప్రోరోగ్‌ చేయలేదనీ.. కేవలం వాయిదా మాత్రమే వేశారని ప్రభుత్వ వర్గాల మాట. కొత్త సెషన్‌లో మాత్రమే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. కానీ తెలంగాణలో గత ఏడాదిన్నరగా ఒకే సెషన్ గా అసెంబ్లీ నడుస్తోందంటున్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అనేది సంప్రదాయం మాత్రమే అని.. రాజ్యాంగంలోని నిబంధన కాదనే అభిప్రాయం వినిపిస్తున్నారు.

తెలంగాణలో కొన్నాళ్లుగా రాజ్ భవన్ వర్సెస్ ప్రగతిభవన్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇటీవల ఖమ్మం సభలోనూ గవర్నర్ ఇష్యూపై నాయకులు కామెంట్లు చేశారు. తర్వాత గవర్నర్ తమిళిసై సైతం స్పందించారు. రాష్ట్రంలో ప్రోటోకాల్ పాటించడం లేదని.. ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లోనైనా పాటిస్తారో లేదో చూడాలంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం ఉండదని చెప్తున్నారు.

ఇటీవలే తమిళనాడులోనూ గవర్నర్ – ప్రభుత్వం మధ్య పెద్ద వివాదమే నడిచింది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ రవి ప్రసంగం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఆయన ప్రసంగంపై వ్యతిరేక తీర్మానం కూడా చేసింది తమిళనాడు సర్కార్. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. అందుకే గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం ముందుకు వెళ్తోందనే టాక్ పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా వినిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..