Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ ప్రాంతంలో ‘షీ షటిల్’ ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభం..

మహిళల భద్రతకోసం షీ షటిల్‌ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించింది. బాలానగర్‌ జోన్‌ డీసీపీ సందీప్‌రావు బస్సు లాంఛనంగా ప్రారంభించారు. మేడ్చల్‌జిల్లా దూలపల్లి పారిశ్రామికవాడలో..

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ ప్రాంతంలో ‘షీ షటిల్’ ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభం..
She Shuttle
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 22, 2023 | 6:42 AM

మహిళల భద్రతకోసం షీ షటిల్‌ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించింది. బాలానగర్‌ జోన్‌ డీసీపీ సందీప్‌రావు బస్సు లాంఛనంగా ప్రారంభించారు. మేడ్చల్‌జిల్లా దూలపల్లి పారిశ్రామికవాడలో ఐటీ, ఫార్మాస్యూటికల్‌ ఫ్యాక్టరీలో పనిచేసే మహిళల కోసం ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించడంతో ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వారి సహకారంతో విస్ట్రో సాల్వెంట్ ప్రవేట్ లిమిటెడ్‌ సంయుక్త ఆద్వర్యంలో కేవలం మహిళ ఉద్యోగినిల కోసం వీటిని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలానగర్‌ డీసీపీ సందీప్‌రావ్‌ హాజరయ్యారు. వీరితోపాటు పేట్‌ బషీరాబాద్‌ ఏసీపీ, పోలీస్‌ అధికారులు, విస్ట్రో సాల్వెంట్‌ యాజమాన్యం, మహిళ ఉద్యోగినులు పాల్గొన్నారు. డీసీపీ సందీప్‌రావు ఉచితబస్సు సర్వీస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. మహిళల భద్రత కోసం విస్ట్రో సాల్వెంట్ యాజమాన్యం ఉచిత బస్సు ఏర్పాటు చేయడం హర్షిందగ్గ విషమన్నారు డీసీపీ సందీప్‌రావు.

ఈ బస్సు సర్వీసు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. మహిళలకు అన్నీ సౌకర్యాలు ఇందులో ఉండేటట్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు ఉంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లు బోయినపల్లి, బాలనగర్‌, దూలపల్లి మార్గంలో ప్రయాణిస్తుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల నుంచి దూలపల్లి పారిశ్రామికవాడకు వచ్చే మహిళ ఉద్యోగినులు బస్సు సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..