Minister KTR: ఆ విషయంలో కేంద్రం మాట నిలబెట్టుకోలేదు.. తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

Minister KTR: ఆ విషయంలో కేంద్రం మాట నిలబెట్టుకోలేదు.. తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

Minister KTR: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు సంచలన ఆరోపణలు చేశారు. రైల్వే వాగన్ ఫ్యాక్టరీ విషయంలో..

Shiva Prajapati

|

Jan 21, 2021 | 1:54 PM

Minister KTR: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు సంచలన ఆరోపణలు చేశారు. రైల్వే వాగన్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. గురువారం రైల్వే ఉద్యోగుల సమావేశం జరిగిన ఈసమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. తెలంగాణలో రైల్వే వాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఆ హామీ మేరకు రైల్వే వాగన్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కావాల్సిన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. అయితే కేంద్రం మాత్రం తాను ఇచ్చిన హామీ మరిచిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇప్పటి వరకు ఒక్క హై స్పీడ్‌ రైలును కూడా ఇవ్వలేదన్నారు. అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న తెలంగాణకు బుల్లెట్ రైలు కేటాయించిన ఆవశ్యకత ఎంతో ఉందని, కేంద్రం మాత్రం కేటాయించలేదని ఆయన ఆరోపించారు. తాను చాలా దేశాలు తిరిగానని చెప్పిన మంత్రి కేటీఆర్.. ఆ దేశాలు అభివృద్ధిలో ముందు ఉన్నాయని పేర్కొన్నారు. హైస్పీడ్ రైలు కెనక్టివిటీతోనే ఆ దేశాలు అభివృద్ధి చెందాని చెప్పారు. మారు మూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరగాలంటే హై స్పీడ్ రైళ్లు ఉండాలన్నారు. ఈసారి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద పీట వేయాలని మంత్రి కేటీఆర్ కాంక్షించారు.

కాగా, దీనికి ముందు.. తమ ప్రభుత్వం రేల్వే ఉన్నతిని కాంక్షిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగుల హక్కులకు భంగం కలిగితే తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సంస్థల్ని నిర్వీర్యం చేయాలని అనుకుంటే ఉద్యోగులకు తాము సపోర్ట్‌గా నిలుస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హక్కుల రక్షణ కోసం ఉద్యోగులు ఎలాంటి పోరాటాలు చేసినా తాము ముందుంటామని స్పష్టం చేశారు.

Also read:

Tollywood: స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీలపై టాలీవుడ్ ఫోకస్.. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోలదాకా..

తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ సంచలన విషెస్‌.. నేరుగా కేటీఆర్‌కే కంగ్రాట్స్‌ చెప్పిన పద్మారావుగౌడ్‌

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu