Double Murder : కరీంనగర్ జిల్లాలో దారుణం.. కట్టుకున్న భార్య, కన్నకూతురును కడతేర్చిన కిరాతకుడు

కుటుంబ కలహాల నేపధ్యంలో భార్యను, కన్న కూతురిని అత్యంత దారుణంగా చంపేశాడు ఓ కసాయి.

Double Murder : కరీంనగర్ జిల్లాలో దారుణం.. కట్టుకున్న భార్య, కన్నకూతురును కడతేర్చిన కిరాతకుడు
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 21, 2021 | 3:15 PM

Husband kills wife, daughter : మనుషుల్లో రాను రానూ మానవత్వం మంటగలుస్తోంది. కట్టుకున్న భార్య, కన్న కూతరునే పొట్టనపెట్టుకున్నాడు ఓ కసాయి భర్త. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపధ్యంలో భార్యను, కన్న కూతురిని అత్యంత దారుణంగా చంపేశాడు. వెంకటేష్ అనే వ్యక్తి తన భార్య రమను, కూతురు ఆమనిపై ఇనుపరాడ్‌తో తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి, కూతురు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో భయపడిన నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. కాగా, విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Virushka: ‘తొలిసారి’ కెమెరా కంటికి చిక్కిన విరుష్క జంట.. క్లినిక్‌ నుంచి బయటకు వస్తుండగా..