Joe Biden’s speechwriter: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పీచ్‌ డైరెక్టర్ల బృందంలో తెలంగాణ వాసి

Joe Biden’s speechwriter: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. 77 వయసులో జో బైడెన్‌ వైట్‌ హౌస్‌లో అడుగుపెట్టారు...

Joe Biden’s speechwriter: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పీచ్‌ డైరెక్టర్ల బృందంలో తెలంగాణ వాసి
Follow us
Subhash Goud

|

Updated on: Jan 21, 2021 | 3:49 PM

Joe Biden’s speechwriter: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. 77 వయసులో జో బైడెన్‌ వైట్‌ హౌస్‌లో అడుగుపెట్టారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షురాలు భారత సంతతికి చెందిన మహిళ కమలా హ్యారిస్‌ కూడా ప్రమాణం చేశారు. అయితే బైడెన్‌ టీమ్‌లో భారతీయులు కూడా ఉన్నారు. అందులో తెలుగు ప్రజలు గర్వించదిగిన విషయం ఒకటి ఉంది. బైడెన్‌ బృందంలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నారు. తెలుగు వ్యక్తికి అరుదైన స్థానం దక్కింది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి వినయ్‌రెడ్డి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పీచ్‌ డైరెక్టర్ల బృందంలో ఒకరిగా నియమితులయ్యారు. వినయ్‌రెడ్డి తండ్రి నారాయణ వృత్తిరీత్యా డాక్టర్‌. 40 ఏళ్ల కిందటనే అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వినయ్‌రెడ్డి అమెరికాలోనే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆంగ్లంపై మంచి పట్టు ఉండటంతో బైడెన్‌ స్పీచ్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు.

వినయ్‌రెడ్డి తండ్రి అమెరికాలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సొంత గ్రామానికి వచ్చి వెళ్తుంటాడు. వినయ్‌రెడ్డి కుటుంబానికి పోతిరెడ్డిపేట గ్రామంలో ఇల్లు, వ్యవసాయ భూమి ఉంది. వినయ్‌రెడ్డి తాత తిరుపతిరెడ్డి పోతిరెడ్డిపేట గ్రామానికి 30 ఏళ్ల పాటు సర్పంచ్‌గా సేవలందించారు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డి పేట గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. వినయ్‌కు బైడెన్‌ బృందంలో చోటు దక్కడంతో పోతిరెడ్డిపేట గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Joe Biden Calls on Nation : నేను మీ వాడిని.. తొలి ప్రసంగంలోనే ఆకట్టుకున్న నూతన అధ్యక్షుడు జో బైడెన్