California Covid-19: కరోనా విలయతాండవం.. కాలిఫోర్నియాలో 30 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
California Covid-19: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే అమెరికాలోని కాలిఫోర్నియా..
California Covid-19: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 30 లక్షలు దాటేసిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికాలో 30 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదైన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది.
4 కోట్ల జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో డిసెంబర్ 24 వరకు 20 లక్షల పాజిటివ్ కేసులే ఉండేవి. నెల రోజుల్లోనే కేసులు ఒక్కసారిగి పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు 33 వేలకుపైగా కరోనా మరణాలు సంభవించాయి. 30 రాష్ట్రాల్లో వారం రోజుల్లోనే మరణాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అమెరికాలో మరణాల సంఖ్య 4 లక్షలు దాటేసింది. అమెరికాలో ఇప్పటి ఇవరకు 2.4 కోట్ల కేసులు బయటపడ్డాయి. ఇక ఈశాన్య చైనాలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.
ఇలా ఆ దేశంలో పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడు అందుబాటులోకి వస్తుండటంతో కేసుల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక వైపు కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో కట్టడి రాకముందే మరోవైపు యూకే స్ట్రెయిన్ వైరస్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే యూకే, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్‌తో పాటు మొత్తం నాలుగు రకాల వైరస్‌లు గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ ఈ కొత్త రకం వైరస్‌పై కూడా పని చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read: India Corona Cases: దేశంలో కొత్తగా 15,223 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా