‘డోనాల్డ్ ట్రంప్ నాకు ఉదాత్తమైన లేఖ రాశారు, దానిపై ఇప్పుడే చెప్పను’, అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ఉదాత్తమైన లేఖ రాశారని, కానీ దాని వివరాలు ఇప్పుడే చెప్పనని నూతన అధ్యక్షుడు జో బైడెన్..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ఉదాత్తమైన లేఖ రాశారని, కానీ దాని వివరాలు ఇప్పుడే చెప్పనని నూతన అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అది ప్రైవేట్ అని ఆయన పేర్కొన్నారు. వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆయన.. త్వరలో తను ట్రంప్ తో మాట్లాడతానని, ఆ తరువాతే ఈ లేఖ వివరాలు చెబుతానని అన్నారు. ఈ కార్యాలయంలో బైడెన్ ఈ లేఖను చదువుతున్నప్పుడు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి అక్కడే ఉన్నారు. ఇది ప్రైవేట్ అని సార్ చెప్పారు కదా..అందువల్ల నేను కూడా దీనిపై ఏమీ మాట్లాడాడలేనని ఆమె అన్నారు. సమయం వచ్చినప్పుడు బైడెన్ స్వయంగా చెబుతారన్నారు. కాగా సంప్రదాయం ప్రకారం కొత్త అధ్యక్షునికి పాత అధ్యక్షుడు గౌరవపూర్వకంగా టీ విందు ఇవ్వాల్సి ఉండగా ట్రంప్ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టారు. అయితే అమెరికా చరిత్రలో మరో సంప్రదాయంగా వస్తున్న ఈ లేఖను మాత్రం రాశారు.
మరోవైపు ట్రంప్ బైడెన్ కి ఓ లేఖ రాశారని, అందులో నాదే సక్సెస్ అని ఉందని ఓ లెటర్ సర్క్యులేట్ అవుతోంది. కానీ అది ఫేక్ అని ఆ తరువాత తేలింది.