క్రేజీ ఛాన్స్ కొట్టేసిన శృతిహాసన్.. ‘లెస్బియన్‏’ పాత్రలో కనిపించనున్న ముద్దుగుమ్మ.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్..

హీరో రవితేజా.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో ఇటీవల విడుదల చిత్రం 'క్రాక్'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన

క్రేజీ ఛాన్స్ కొట్టేసిన శృతిహాసన్.. 'లెస్బియన్‏' పాత్రలో కనిపించనున్న ముద్దుగుమ్మ.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 21, 2021 | 3:04 PM

హీరో రవితేజా.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో ఇటీవల విడుదల చిత్రం ‘క్రాక్’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ శృతి హాసన్ నటించింది. ఇక క్రాక్ మూవీ హిట్‏తో వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ జోష్‏లో ఉంది ఈ బ్యూటీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది.

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించిన ‘లస్ట్ స్టోరీస్’ ఓటీటీ వేదిక అయిన నెట్‏ఫ్లిక్స్‏లో విడుదలై ఎంతంగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. అయితే దీని ఆధారంగానే తెలుగులో ‘పిట్ట కథలు’ పేరుతో ఓ వెబ్ డ్రామాని నెట్‏ఫ్లిక్స్‏లో విడుదల కానుంది. ఈ సిరీస్‏ నాలుగు భాగాలుగా నలుగురు దర్శకులు తెరకెక్కించారు. ఇందులో నటి లక్ష్మీ మంచు, శృతిహాసన్, అమలాపాల్, ఈషా రెబ్బ, జగపతి బాబు, సత్యదేవ్, సంగీతా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. దీనిని నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ రూపొందించగా.. బుధవారం విడుదలైన ఈ సిరీస్ టీజర్‏కు విశేషస్పందన లభించింది. ఇక ఇందులో హీరోయిన్ శృతిహాసన్ లెస్బియన్‏గా కనిపించబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లో శృతి హాసన్ ఓ అమ్మాయితో కనిపిస్తున్న సన్నివేశాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. పిట్టకథలు సిరీస్ నెట్‏ఫ్లిక్స్‏లో ఫిబ్రవరి 19న స్ట్రీమింగ్ కాబోతుంది.

Also Read:

Virushka: ‘తొలిసారి’ కెమెరా కంటికి చిక్కిన విరుష్క జంట.. క్లినిక్‌ నుంచి బయటకు వస్తుండగా..