‘తాండవ్’ తరువాత ఇక ఇప్పుడు ‘మిర్జాపూర్’ సిరీస్ వంతు,మేకర్స్ కు, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కు సుప్రీంకోర్టు నోటీసులు
'తాండవ్' సిరీస్ తరువాత ఇక ఇప్పుడు మరో వెబ్ సిరీస్..'మిర్జాపూర్' వంతు వచ్చింది. ఈ షో మేకర్స్ కు, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
‘తాండవ్’ సిరీస్ తరువాత ఇక ఇప్పుడు మరో వెబ్ సిరీస్..’మిర్జాపూర్’ వంతు వచ్చింది. ఈ షో మేకర్స్ కు, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మిర్జాపూర్ వాసి ఒకరు దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని కోర్టు నోటీసులు పంపింది. ఈ సిరీస్ లో కూడా మతపరమైన, సామాజిక, ప్రాంతీయ సెంటిమెంట్లను గాయపరిచే సన్నివేశాలు, అక్రమ సంబంధాలను ప్రోత్సహించే సీన్లు ఉన్నాయని అరవింద్ చతుర్వేది అనే వ్యక్తి తన పిటిషన్ లో ఆరోపించారు. ఈయన దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని తాము ఈ సిరీస్ మేకర్స్ రితేష్ సిద్వానీ, ఫరా అఖ్తర్ తో బాటు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ పై కూడా ఎఫ్ ఐ ఆర్ పెట్టామని మీర్జాపూర్ నుంచి ముంబై వచ్చిన పోలీసులు తెలిపారు. ఈ సిరీస్ లో యూపీ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నట్టు చతుర్వేది తెలిపారు. గత ఏడాది కూడా ఈ షో వివాదాస్పదమైంది. యూపీ అభివృద్ధిని దిగజార్చేలా ఇందులో చూపారని ఎంపీ అనుప్రియ పటేల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆమె పీఎం మోదీని ఉద్దేశించి ట్వీట్ చేయడం విశేషం. ఈ సిరీస్ లో పంకజ్ త్రిపాఠీ, అలీ ఫజల్, హర్షితా గౌర్, శ్వేతా త్రిపాఠీ తదితరులు నటించారు.
కాగా తాండవ్ సిరీస్ డైరెక్టర్ సహా ఈ సిరీస్ యూనిట్ సభ్యులంతా బేషరతుగా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. వీరిలో సైఫ్ అలీఖాన్, డింపుల్ కపాడియా ప్రభృతులు ఉన్నారు. Read Also:మహేష్ బాబుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన సూర్య.. ‘సర్కారు వారి పాట’ కోసం వెయిటింగ్..!. Read Also:ఇకపై ఇంటికే మందులు.. ఆన్‌లైన్ ఫార్మసీలోకి ఈ కామర్స్ దిగ్గజం.. అమ్మకాలు మొదలుపెట్టిన అమెజాన్.