వికారాబాద్ జిల్లాలో దారుణం.. తల్లి చేయి పట్టుకున్నాడని ఓ యువకుడి ఘాతుకం.. కత్తితో దాడి.. ఓ వ్యక్తి మృతి

బంట్వారం మండల కేంద్రానికి చెందిన ఎర్రవల్లి మల్లేశం(40)పై అదే గ్రామానికి చెందిన సందపురం రాజు పాత కక్షలతో కత్తితో హతమార్చాడు.

వికారాబాద్ జిల్లాలో దారుణం.. తల్లి చేయి పట్టుకున్నాడని ఓ యువకుడి ఘాతుకం.. కత్తితో దాడి.. ఓ వ్యక్తి మృతి
murders
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 21, 2021 | 3:36 PM

Man Murder : వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. సంవత్సర క్రితం పొలం వద్ద తన తల్లి చేయి పట్టుకుని అసభ్యంగ్యా ప్రవర్తించినందుకు అదను చూసి కత్తితో దాడి చేసి హతమార్చాడు ఓ యువకుడు. బంట్వారం మండల కేంద్రానికి చెందిన ఎర్రవల్లి మల్లేశం(40)పై అదే గ్రామానికి చెందిన సందపురం రాజు పాత కక్షలతో కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ మల్లేశంను 108 వాహనంలో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తన తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణం చేతనే దాడి చేశానని నిందితుడు రాజు ఒప్పకున్నాడని పోలిసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసిన రిమాండ్‌కు తరలించారు.

Read Also… Double Murder : కరీంనగర్ జిల్లాలో దారుణం.. కట్టుకున్న భార్య, కన్నకూతురును కడతేర్చిన కిరాతకుడు