అలాంటి రూమర్స్‏ను ప్రచారం చేయకండి.. ఆ సినిమా గురించి పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ గుణశేఖర్..

అలాంటి రూమర్స్‏ను ప్రచారం చేయకండి.. ఆ సినిమా గురించి పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ గుణశేఖర్..

తెలుగులో రుద్రమదేవి సినిమాతో ఓరుగల్లు చరిత్రను మరోసారి వెండితెరపై అద్బుతంగా రూపొందించాడు డైరెక్టర్ గుణశేఖర్.

Rajitha Chanti

|

Jan 21, 2021 | 3:35 PM

Shakuntalam Movie Update: తెలుగులో రుద్రమదేవి సినిమాతో ఓరుగల్లు చరిత్రను మరోసారి వెండితెరపై అద్బుతంగా రూపొందించాడు డైరెక్టర్ గుణశేఖర్. ఆ సినిమా తర్వాత హీరో రానాతో కలిసి హిరణ్యకశ్యప అనే భారీ ప్రాజెక్ట్‏ను చేయాలని అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇక కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని.. శాకుంతలం అనే ప్రాజెక్ట్‏తో మళ్ళీ ముందుకు వచ్చాడు. మహాభారతంలోని ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

ఈ క్రమంలోనే ఇందులో శకుంతల పాత్రగా ఎవరు నటిస్తున్నారనేదానిపై గతంలో చాలా వార్తలు వచ్చాయి. దీంతో ఈ చిత్రంలో శకుంతల పాత్రను హీరోయిన్ అక్కినేని సమంత నటించనుందని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. దీంతో ఆ పుకార్లకు తెరపడింది. ఇక ఇదే సమయంలో దుష్యంతుడు పాత్రలో ఎవరు నటించబోతున్నారనే సందేహాలు చాలా మందిలో తలెత్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా దుష్యంతుడు పాత్రలో హీరో రానాతోపాటు, పలువురు ప్రముఖ హీరోలు నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ పుకార్ణపై చిత్రబృందం స్పందించింది. “ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇతరుల పేర్లను ప్రచారం చేయవద్దు. మీ సపోర్ట్‏కి మా ధన్యవాదాలు” అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read:

RED movie : మంచి టాక్ తో దూసుకుపోతున్న రామ్ ‘రెడ్’ మూవీ.. త్వరలోనే మిగిలిన భాషల్లో కూడా…

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu