తెలంగాణ డిప్యూటీ స్పీకర్ సంచలన విషెస్.. నేరుగా కేటీఆర్‌కే కంగ్రాట్స్ చెప్పిన పద్మారావుగౌడ్
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సంచలన విషెస్ చేశారు. కంగ్రాట్స్ సీఎం గారు అంటూ నేరుగా కేటీఆర్‌తోనే..
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగ్రాట్స్ సీఎం గారు అంటూ నేరుగా కేటీఆర్‌తోనే పద్మారావు చెప్పడం రాజకీయంగా సంచలనం రేపుతుంది. తెలంగాణలో సీఎం మార్పు ఖాయమంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం హోరెత్తుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ స్థానంలో ఆయన తనయుడు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సీఎం పగ్గాలు అందుకోబోతున్నారని, అందుకు ముహూర్తం కూడా ఖరారు అయిందని ప్రచారం సాగుతుంది.
పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం అవుతారని కొందరు.. అయితే తప్పేంటని మరికొందరు మద్దతు పలుకుతూ వచ్చారు. అయితే వాళ్లంతా ఎక్కడో.. వేర్వేరు సమావేశాల్లోనో, ప్రెస్‌మీట్లలోనో వారి మనసులో మాట బయటపెడుతూ వచ్చారు.
ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఓ అడుగు ముందుకేసి స్వయంగా కేటీఆర్ సమక్షంలోనే కాబోయే సీఎం కంగ్రాట్స్ అంటూ విష్ చేయడం సంచలనంగా మారింది. అటు మంత్రలు మద్దతు పలకడం, ఇటు ఎమ్మెల్యేలు వంత పాడటం.. ఆఖరికి డిప్యూటీ స్పీకర్ కూడా కంగ్రాట్స్ చెప్పడం చూస్తుంటే నిజంగానే ఏదో జరగబోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.