Minister Harish Rao: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మంత్రి హరీష్ రావు లేఖ.. ఏం చెప్పారంటే
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తాజాగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్టినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయొద్దని డిమాండ్ చేశారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగుల జీవితాలను దృష్టిలో ఉంచుకోని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తాజాగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్టినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయొద్దని డిమాండ్ చేశారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగుల జీవితాలను దృష్టిలో ఉంచుకోని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. డిఫెన్స్ రంగంలో ఉన్న ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుందని తెలిపారు. దీనివల్ల కొత్తగా తయారు చేసేందుకు ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుందన్నారు. అలాగే మేకిన్ ఇండియా స్పుర్తి కూడా దెబ్బతింటుందని తెలిపారు.
మెదక్ లోని ఆర్డునెన్స్ ఫ్యాక్టరీకి, సిబ్బందికి గత ఆర్థక సంవత్సరంలో కావాల్సినంత పని ఉండేదన్నారు. దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సమయానికి పూర్తి చేశారని తేలిపారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సంస్థ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదని.. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ‘సిక్ ఇండస్ట్రీ’ గా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఒకవేళ ఇదే జరిగితే ప్రత్యక్షంగా సుమారు 2500 మంది ఉద్యోగులు, పరోక్షంగా 5000 మంది ఉపాధి దెబ్బతింటుందని… మొత్తంగా సుమారు 25 వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుందని స్పష్టం చేశారు.
ఆయుధ కర్మాగార తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య అభ్యర్థ మేరకు మంత్రి హరీశ్‌రావు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఆరు డిమాండ్లు చేశారు. వీటిలో రక్షణ రంగ సంస్థలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం, పరిశోధనా విభాగాలను బలోపేతం చేయడం, మిషన్‌ను ఆధునీకరించడం, ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించడం, పరిపాలన మరియు సేకరణ విధానాలను సరళీకృతం చేయడం, అలాగే ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కోసం ఆర్డర్ చేయడం వంటివి ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..