Medchal Election Result 2023: మేడ్చల్ నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్న మల్లారెడ్డి
Medchal Assembly Election Result 2023 Live Counting Updates: ఈ సారి ఎన్నికల్లో వరుసగా రెండోసారి బీఆర్ఎస్ నుంచి మల్లా రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తోటకూర వజ్రేశ్ యాదవ్ పోటీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచినప్పటికీ ఇక్కడ మాత్రం మల్లారెడ్డే గెలిచారు.

యావత్ తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో మేడ్చల్ నియోజకవర్గం (Medchal Assembly Election) ఒకటి. మేడ్చల్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన ఈ అసెంబ్లీ స్థానానికి ప్రస్తుతం మంత్రి సీహెచ్ మల్లా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సీహెచ్ మల్లారెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. గతంలో దేవేందర్ గౌడ్ మూడు పర్యాయాలు, మర్రి చెన్నారెడ్డి ఒకసారి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు. మేడ్చల్ నియోజకవర్గంలో 6.37 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.46 లక్షల మంది పురుషులు, 2.42 లక్షల మంది మహిళా ఓటర్లు. నవంబరు 30న జరిగిన పోలింగ్‌లో ఈ నియోజకవర్గంలో 54.02శాతం ఓటింగ్ నమోదయ్యింది.
ఈ సారి ఎన్నికల్లో వరుసగా రెండోసారి బీఆర్ఎస్ నుంచి మల్లా రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తోటకూర వజ్రేశ్ యాదవ్ బరిలో నిలిచారు. బీజేపీ నుంచి ఏనుగు సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. అయితే మల్లారెడ్డినే విజయం వరించింది. 33419 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్‌పై గెలిచారు మల్లారెడ్డి. ఏనుగు సుదర్శన్ రెడ్డి.. 50535 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్
2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎం సుధీర్ రెడ్డి ఇక్కడి నుంచి 43,455 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సుధీర్ రెడ్డికి 114,235 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి తోటకూర జంగయ్య యాదవ్‌కు 70,780 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి (కేఎల్ఆర్) 58,016 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అనూహ్యంగా 2018లో ఈ నియోజకవర్గ సీటును మల్లా రెడ్డికి కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. నాటి ఎన్నికల్లో మల్లా రెడ్డి 87,990 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మల్లా రెడ్డికి 167,324 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి 79,334 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి నక్క ప్రభాకర్ గౌడ్‌కి 25,829 ఓట్లు, బీజేపీ అభ్యర్థి పెద్ది మోహన్ రెడ్డికి 23,041 ఓట్లు పోల్ అయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్




