ఆ కలెక్టర్ స్టైలే వేరు.. సైకిల్‌పై వెళ్లి ఆకస్మిక తనిఖీ.. మెదక్ కలెక్టర్‌ను చూసిన జనం ఫిదా!
చిన్న ప్రభుత్వ ఉద్యోగం రాగానే కొంతమంది మామూలుగా ఫీల్ కారు. ఇక వారి స్టయిల్ హద్దు అనేది ఉండదు. కానీ ఎప్పుడు బిజీగా ఉండే ఓ జిల్లా కలెక్టర్.. తన సింపుల్ సిటీ అంటే ఏంటో చూపించాడు. తన భార్యతో కలిసి ఒకటి కాదు రెండు 20 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కారు. మెదక్ నుండి రామయంపేట వరికు సైకిల్ తొక్కుతూ వెళ్లారు. రిటర్న్‌లో సాధారణ వ్యక్తిలాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. ఆదివారం(మార్చి 23) ఉదయం మెదక్ జిల్లా కేంద్రం నుండి 20 కిలోమీటర్ల మేర సైకిల్ పై ప్రయాణం చేసిన కలెక్టర్ రామయంపేట ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించారు. మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలం దృష్ట్యా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను పరిశీలించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ రాహుల్. తిరిగి మెదక్‌కు సామాన్య ప్రయాణికుడి లాగా తన భార్యతో కలిసి ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి మెదక్ వెళ్లారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందున మహిళలు 70% మేర ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఏది ఏమైనా ఓ జిల్లా కలెక్టర్ ఇలా సైకిల్ పై రావడం.. మళ్ళీ బస్సులో అందరితో కలిసి సింపుల్ గా వెళ్లడం చూసి అందరూ షాక్ అయ్యారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..