Khammam: ఆడపిల్ల పుడితే మిఠాయి బాక్సు.. వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్!
Khammam: ఆడపిల్ల జన్మించడం ఆ తల్లిదండ్రులకు గర్వకారణంగా భావించేలా కలెక్టరు స్వీట్ బాక్సును అధికారులతో వారి ఇళ్లకు పంపించడానికి చర్యలు తీసుకున్నారు. ఆడపిల్ల పుడితే సమాజంలో ఉన్న పక్షపాతం పొటొట్టే సంస్కృతిని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇందు కోసం 'గర్ల్ ప్రైడ్' పేరిట ఓ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు ఆ శిశువును ప్రసవించిన ఆసుపత్రిలో వదిలి వెళ్లిన ఘటనలు ఎన్నో చూశాము. ఆడ పిల్ల పుట్టిందని వదిలి వెళ్లిన ఘటనలు ఖమ్మం నగరంలో గతంలో జరిగింది. తల్లి వదిలి వెళ్లగా పాల కోసం ఆ చిన్నారి గుక్క పట్టి ఏడుస్తుంటే గమనించిన ఆసుపత్రి నర్సులు ఆ శిశువును ఖమ్మంలోని శిశుగృహానికి తరలించారు. ఇలాంటి ఘటనలు ఖమ్మంలోనే పలు చోట్ల జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘గర్ల్ ప్రైడ్’ పేరిట ఓ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఖమ్మం జిల్లాలో ఆడపిలల్ల పుట్టిన ఇంటికి జిల్లా అధికారులు వెళ్లి వారింట్లో మిఠాయి బాక్సు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. తాజాగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అని అమ్మాయి పుట్టడం శుభ సూచకమని ప్రజల్లో ప్రచారం చేసేందుకు తాను ఈ పథకాన్ని ప్రారంభించానని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. వచ్చే వారం నుంచి ఈ గర్ల్ ప్రైడ్ కార్యక్రమం కోసం జిల్లా అధికారుల పర్యటనలను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
ఆడపిల్ల జన్మించడం ఆ తల్లిదండ్రులకు గర్వకారణంగా భావించేలా కలెక్టరు స్వీట్ బాక్సును అధికారులతో వారి ఇళ్లకు పంపించడానికి చర్యలు తీసుకున్నారు. ఆడపిల్ల పుడితే సమాజంలో ఉన్న పక్షపాతం పొటొట్టే సంస్కృతిని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చెప్పారు. ఆడపిల్లల ప్రాముఖ్యతను ప్రోత్సహించడంతో పాటు సామాజిక దృక్పథాన్ని మార్చడానికి తాను ఈ కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్నానని అన్నారు.
దీనితో పాటు, 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఈ విద్యార్థుల పరీక్షల సంసిద్ధతను పర్యవేక్షించడానికి, వారి తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉండటానికి ప్రతిరోజూ సాయంత్రం వారి ఇళ్లను సందర్శించాలని ఆయన వారిని ఆదేశించారు. ఈ కీలకమైన విద్యా దశలో విద్యార్థులకు తగిన మార్గదర్శకత్వం, మద్దతు లభించేలా చూడడమే లక్ష్యం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి