Telangana: రూ.2కే షర్ట్ అంటూ ఆఫర్.. ఎగబడిన జనం.. కట్‌చేస్తే కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్!
వ్యాపారులు ఈ మద్య ఒక సరికొత్త ట్రెండ్‌కు అలవాటు పడ్డారు. కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను అందిస్తున్నట్టు మితిమీరిన ఆఫర్స్ ప్రకటిస్తున్నారు..తీరా ఆఫర్స్ చూసి భారీగా జనాలు వచ్చే సరికి వాళ్లను సంతృప్తి పరచలేక షాప్‌లు క్లోజ్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో వెలగు చూసింది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.

అఫర్ అఫర్ ఈ పేరు వింటే చాలు.. మనవాళ్ళకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి చేరుతుంది. ఇక ఈ అఫర్ బట్టలపై ఉంది అంటే ఇక మామూలుగా ఉండదు. ఇలాంటి వాటిని ఆసరాగా చేసుకొని చాలా మంది బట్టల షాప్ యజమానులు. వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ స్టాక్‌ను అమ్మేస్తారు. ఇక్కడో బట్టల షాప్ యజమానికి కూడా అదే ఆలోచన చేసి.. కస్టమర్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కానీ ఆ షాప్‌కి వచ్చిన జనాన్ని చూసి ఒక్కసారిగా షాక్ గురై.. దెబ్బకు షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. వివరాల్లోకి వెలితే.. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఉన్న చేతన్ మెన్స్ వేర్ యజమాని ఒక ఆఫర్ పెట్టాడు. రూ.2కే షర్ట్ ఇస్తున్నట్టు రీల్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ రీల్‌ను చూసిన స్థానికులు దీన్ని తెగ వైరల్ చేశారు.
రూ.2కే షర్ట్ అనడంతో వీడియో చూసిన స్థానిక జనాలు, యువకులు భారీ ఎత్తున చెతన్ మెన్స్‌వేర్ దగ్గరకు చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా అంతమంది జనాన్ని చూసిన షాప్ యజమానికి షాక్‌కు గురయ్యాడు. అయితే తను పోస్ట్ చేసిన వీడియోలో ఆఫర్ గడువు 10 నిమిషాలే అంటూ చెప్పినట్టు షాపు యజమాని అక్కడికి వచ్చిన వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఎంత నచ్చచెప్పిన సదురు కస్టమర్స్ వినకపోగా గొడవకు దిగడంతో అతని షాపును వదిలి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షాపు షెటర్‌ను క్లోజ్ చేసి యువకులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




