Medak Election Result 2023: మెదక్‌లో సత్తాచాటిన మైనంపల్లి రోహిత్.. పద్మాదేవేందర్ రెడ్డి పరాజయం..

Medak Assembly Election Result 2023 Live Counting Updates: బీఆర్ఎస్ టికెట్‌‌తో తన తనయుడిని మెదక్ నుంచి ఎన్నికల అరంగేట్రం చేయించాలని మైనంపల్లి ఉవ్విళ్లూరారు. అయితే తన తనయుడికి టికెట్ దక్కకపోవడంతో మైనంపల్లి తండ్రీతనయులు కాంగ్రెస్‌లో చేరి ఇద్దరికీ టికెట్ సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మెదక్ బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉందని.. మరోసారి పద్మా దేవేందర్ రెడ్డి అక్కడి నుంచి విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేశారు.

Medak Election Result 2023: మెదక్‌లో సత్తాచాటిన మైనంపల్లి రోహిత్.. పద్మాదేవేందర్ రెడ్డి పరాజయం..
Medak Politics
Follow us
Janardhan Veluru

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 03, 2023 | 2:04 PM

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బిగ్ ఫైట్ నెలకొంటున్న నియోజకవర్గాల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం (Medak Assembly Election) ఒకటి. ఇక్కడ పద్మా దేవేందర్ రెడ్డి, మైనంపల్లి రోహిత్ రావు మధ్య హోరీహోరీ పోరు నెలకొంది.. మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాల్లోని ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ గెలుపొందారు.  మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై.. రోహిత్ గెలుపొందారు.  పద్మాదేవేందర్ రెడ్డిపై 9, 238 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఈ నియోజకవర్గ పరిధిలో మెదక్, పాపన్నపేట, రామాయంపేట, శంకరంపేట్ మండలాలు ఉన్నాయి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉన్నారు. నవంబరు 30న జరిగిన పోలింగ్‌లో ఈ నియోజకవర్గంలో 85.32 శాతం ఓటింగ్ నమోదయ్యింది.  తెలంగాణ అసెంబ్లీ తొలి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించగా.. తాజాగా.. ఎన్నికల్లో రోహిత్ కాంగ్రెస్ జెండా ఎగురేశారు.

1957 నుంచి ఇప్పటివరకు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాలనికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు, తెలుగుదేశం పార్టీ మూడుసార్లు, స్వతంత్రులు రెండుసార్లు, బీఆర్ఎస్ రెండుసార్లు, సీపీఐ ఒక్కసారి విజయం సాధించింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి ఇక్కడి నుంచి 39,600 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పద్మా దేవేందర్ రెడ్డికి 89,654 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతికి 50,054 ఓట్లు దక్కాయి. 2018 ఎన్నికల్లో వరుసగా రెండోసారి పద్మా దేవేందర్ రెడ్డి ఇక్కడి నుంచి 47,983 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాటి ఎన్నికల్లో పద్మా దేవేందర్ రెడ్డికి 97,670 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డికి 49,687 ఓట్లు దక్కాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

ఈ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బరిలో నిలిచారు. హ్యాట్రిక్ విజయంపై ఆమె కన్నేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్ రావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందగా… బీజేపీ నుంచి పంజా విజయ్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు.  2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి మైనంపల్లి హన్మంతరావు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీఆర్ఎస్ టికెట్‌‌తో తన తనయుడిని మెదక్ నుంచి ఎన్నికల అరంగేట్రం చేయించాలని మైనంపల్లి ఉవ్విళ్లూరారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం తన తనయుడికి మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో మైనంపల్లి తండ్రీతనయుడు కాంగ్రెస్‌లో చేరి ఇద్దరికీ టికెట్ సాధించారు.

మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న మైనంపల్లి.. మెదక్ నుంచి తన తనయుడిని గెలిపించుకోవాలని పట్టుదలతో పనిచేసి గెలిపించుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్

రేపటి నుంచే భారత్-ఆసీసీ ఐదో టెస్టు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రేపటి నుంచే భారత్-ఆసీసీ ఐదో టెస్టు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తక్కువ ధరలో అదిరే ఫీచర్లు.. పది లక్షల్లోపు బెస్ట్‌ కార్లు ఇవే..!
తక్కువ ధరలో అదిరే ఫీచర్లు.. పది లక్షల్లోపు బెస్ట్‌ కార్లు ఇవే..!
అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
పుష్ప స్టైల్‌లో క్రికెట్ ఆడిన వినోద్ కాంబ్లీ.. వీడియో
పుష్ప స్టైల్‌లో క్రికెట్ ఆడిన వినోద్ కాంబ్లీ.. వీడియో
మహిళలపై శుక్రుడు కనక వర్షం.. ఆ రాశుల వారికి అపార ధన లాభాలు
మహిళలపై శుక్రుడు కనక వర్షం.. ఆ రాశుల వారికి అపార ధన లాభాలు
వాలంటీర్లపై కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..?
వాలంటీర్లపై కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..?
వివాదాలకు కేరాఫ్‌గా మారిన సెంట్రల్ జైలు
వివాదాలకు కేరాఫ్‌గా మారిన సెంట్రల్ జైలు
సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఈ ఒక్క పని చేయండి చాలు..
సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఈ ఒక్క పని చేయండి చాలు..
'అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తు కొచ్చారు'.. జానీ మాస్టర్
'అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తు కొచ్చారు'.. జానీ మాస్టర్
వోక్స్‌వ్యాగన్ కారులో 5వేల ఏండ్ల పురాతన ఆలయానికి..
వోక్స్‌వ్యాగన్ కారులో 5వేల ఏండ్ల పురాతన ఆలయానికి..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!