AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘అమ్మానాన్నా.! నన్ను క్షమించండి.. నా కొడుకు జాగ్రత్త’.. కన్నీరు పెట్టిస్తోన్న లక్ష్మీ లెటర్

అమ్మా నాన్నా.! నా కొడుకును మీరే పెంచండి.! మా అత్తమ్మ వాళ్లకు మాత్రం అప్పగించకండి అని అద్దంపై రాసి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న తీరు పలువురిని కలిచివేస్తోంది. పండంటి బిడ్డ పుట్టిందన్న సంబరం లేకుండా వరకట్న వేధింపులకు గురి చేస్తున్న మెట్టినింటి వారి బాధలు భరించలేక..

Telangana: 'అమ్మానాన్నా.! నన్ను క్షమించండి.. నా కొడుకు జాగ్రత్త'.. కన్నీరు పెట్టిస్తోన్న లక్ష్మీ లెటర్
Representative Image 1
G Sampath Kumar
| Edited By: |

Updated on: Apr 25, 2025 | 12:00 PM

Share

అమ్మా నాన్నా.! నా కొడుకును మీరే పెంచండి.! మా అత్తమ్మ వాళ్లకు మాత్రం అప్పగించకండి అని అద్దంపై రాసి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న తీరు పలువురిని కలిచివేస్తోంది. పండంటి బిడ్డ పుట్టిందన్న సంబరం లేకుండా వరకట్న వేధింపులకు గురి చేస్తున్న మెట్టినింటి వారి బాధలు భరించలేక బలవన్మరణానికి పాల్పడిన తీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. సంఘటనా వివరాల్లోకి వెళ్తే. జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన ప్రసన్న లక్ష్మీకి, జిల్లాలోని వెల్గటూరు మండలం రామునూరుకు చెందిన తిరుపతికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ జీవిస్తున్న క్రమంలో ప్రసన్న లక్ష్మీకి బాబు పుట్టాడు. అప్పటి నుండి ఉద్యోగం మానేసిన ఆమె ఇంటికే పరిమితం అయింది.

అయితే ప్రసన్న లక్ష్మీ, భర్త తిరుపతిలు ఇద్దరు కూడా చామన ఛాయ రంగులో ఉండగా, వీరికి కలిగిన సంతానం మాత్రం తెల్లగా ఉండడం ఏంటన్న కారణంతో తరుచూ మెట్టినింటి వారు వేధింపులకు గురి చేశారు. అయితే ప్రసన్న లక్ష్మీ, తిరుపతిలు మొదట ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నప్పటికీ బాబు పుట్టిన తరువాత అనుమానం ముసుగులో కట్నం కోసం వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టారు. వీరి వివాహ సమయంలో ప్రసన్నలక్ష్మీ తండ్రి రూ. 55 లక్షల కట్నం ఇస్తానని ఒప్పుకుని రూ. 10 లక్షలు మాత్రమే ఇచ్చాడని, మిగతా డబ్బు భూమి విక్రయించిన తరువాత ఇస్తానని చెప్పి ఇవ్వలేదని  ప్రసన్న లక్ష్మీని వేధింపులకు గురి చేసేవారు. కట్నం తాలుకు మిగతా డబ్బులు తీసుకురావల్సిందేనని తరుచూ ఆమెను మానసికంగా హింసించేవారు.

మెట్టినింటి వారి వేధింపులు భరిస్తూనే ప్రసన్న లక్ష్మీ కొంతకాలం కాపురాన్ని నెట్టుకుంటూ వచ్చింది. ఐదు రోజుల క్రితం బెంగుళూరు నుండి మెట్టినింటికి చేరుకున్న తరువాత కూడా కట్నం విషయంలో అత్తింటి వారు మానసికంగా వేధించారు. ప్రసన్న లక్ష్మీ తండ్రి బుధవారం రామునూరుకు వెల్లి కూతురును వెంటబెట్టుకుని జగిత్యాలకు చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తరువాత ప్రసన్న లక్ష్మీ ఇంట్లోని అద్దంపై ‘‘అమ్మా, నాన్న నాకు బ్రతకాలని లేదు… నా కొడుకు జాగ్రత్త, ప్లీజ్ వాళ్లకు మాత్రం ఇవ్వకండి’’ అని అద్దంపై రాసి ఫ్యానుకు ఉరి వేసుకుని మరణించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ మీడియాకు తెలిపారు.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి