AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mulugu: ఇంట్లో తవ్వకాలు జరపగా దొరికిన రాగి బిందె.. లోపల మిరిమిట్లు గొలుపుతూ..!

తెలంగాణ, మహారాష్ట్ర కలకలం రేపుతోన్న ఘటన ఇది. గుప్తనిధి తవ్వకాలలో బయట పడ్డ బంగారం ఏమైనట్లు..! ఎవరెంత పంచుకున్నారు..!పోలీసుల దృష్టికి వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు..! వాటాల పంపకంలో తేడాలు రావడంతో బంగారం బాగోతం బయట పడింది. మరి ఆ నిధి ఏమైంది..! అసలు నిధి వ్యవహారం నిజమేనా.. లేదా సెట్టింగా..?

Mulugu: ఇంట్లో తవ్వకాలు జరపగా దొరికిన రాగి బిందె.. లోపల మిరిమిట్లు గొలుపుతూ..!
Treasure Digging Case
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Nov 21, 2025 | 10:08 AM

Share

ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌కు మహారాష్ట్రలోని సిరివంచ సమీపంలోని ఓ ఇంట్లో బంగారం నిధి ఉందని సమాచారం అందింది. గుప్త నిధి సమాచారం తెలిసిన వెంటనే ఇదే గ్రామానికి చెందిన ఒక కారు తీసుకుని అందులో నలుగురు కలిసి మహారాష్ట్రలోని సిరివంచకు వెళ్లారు. సిరివంచ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఓ ఇంట్లో బంగారం ఉన్నదని తెలిసిన సమాచారంతో.. ఆ ఇంట్లో ఐదు రోజులపాటు గడిపి బంగారు నిధి ఉన్న ప్రాంతంలో పూజలు జరిపి తవ్వకాలు  చేపట్టారు. నిధి తవ్వకాలు అంతా వాళ్ల సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.

పూజలు నిర్వహించిన అనంతరం గుప్తనిధి తవ్వకాలు జరిపి రాగిబిందెను బయటకు తీశారు. దీనిపై దృష్టశక్తి ఉందని దానిని తొలగించాక వస్తానని ఇంటి యజమానికి చెప్పి మంగపేటకు తీసుకువచ్చారు.. మూడు కోళ్లను బలిచ్చి పూజలు నిర్వహించారు. తవ్వకాలలో బయటపడ్డ బిందెలో భారీ ఎత్తున గోల్డ్ కాయిన్స్ లభ్యం అయినట్లు సమాచారం. ఒక్కో కాయిన్ సుమారు 23 గ్రాముల వరకు ఉంటుందని అక్కడికి వెళ్లిన ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. మహారాష్ట్ర నుంచి గుప్తనిధితో స్వగ్రామానికి చేరుకున్న వారందరూ బంగారు బిల్లలున్న బిందెపై శక్తి ఉంది.. పాతిపెట్టి పూజ చేశాక పంచుకుందామని ఏకాభిప్రాయంతో ఇంటి పరిసరాల్లోని ఓ బొప్పాయి చెట్టు మొదట్లో పాతి పెట్టినట్లు సమాచారం.. మరుసటి రోజు పంపకాల విషయంలో తేడా జరిగింది..

ఈ విషయం ఆ నోట ఈ నోట కాస్త ఆలస్యంగా పోలీసులకు తెలియడంతో సదరు ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.. ఇంతకీ ఆ నిధి ఏమైంది..! అందులో దొరికిన బంగారం ఎంత..! ఎవరెవరు పంచుకున్నారు అనే చర్చ జరుగుతుంది. అయితే అనుకోకుండా నిధి దొరకొచ్చు కానీ.. ఇలా ఫలానా చోట నిధి ఉందని ముందుగానే తెలుసుకుని వెలికితీయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా మోసాలు తరచుగా జరగుతాయని మనకు తెలిసిందే. బ్లఫ్ చేసి.. ఇదంగా సెటప్ చేసి ఉండొచ్చని కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం పోలీసుల పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us