AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి!

ఆడుకుంటూ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లోకి వెళ్లిన ఐదేళ్ల చిన్నారి.. అనూహ్యంగా అందులో చిక్కుకుని మృతి చెందింది. ఈ హృదయ విదరక ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ లేడీస్‌ హాస్టల్‌లో చోటుచేసుకుంది. మృతిచెందిన చిన్నారిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిస్తు ఘోష్‌గా గుర్తించారు. అసలేం జరిగిందంటే..

Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి!
Apartment Grill Lift Accident
Srilakshmi C
|

Updated on: May 13, 2026 | 5:50 PM

Share

హైదరాబాద్‌, మే 13: అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విదరక ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ లేడీస్‌ హాస్టల్‌లో చోటుచేసుకుంది. మృతిచెందిన చిన్నారిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిస్తు ఘోష్‌గా గుర్తించారు. అసలేం జరిగిందంటే..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులు గౌలిదొడ్డిలోని మహి వుమెన్ పీజీ అనే ప్రైవేట్‌ లేడీస్‌ హాస్టల్‌లో వంట పనిచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. వీరికి ఐదేళ్ల చిన్నారి బిస్తు ఘోష్‌ ఉంది. బుధవారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్‌ గ్రిల్‌ లిఫ్ట్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి 5వ ఫ్లోర్‌కు చిన్నారి వెళ్లింది. అయితే లిఫ్ట్‌లో వెళ్తుండగా ప్రమాదవశాత్తు 3వ ఫ్లోర్‌లో చిన్నారి జుట్టు లిఫ్ట్‌ గ్రిల్స్‌ మధ్య ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి తల మొత్తం నుజ్జునుజ్జయింది. దీంతో బిస్తు ఘోష్‌ అక్కడికక్కడే మృతి చెందింది.

వెంటనే స్థానికులు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హైడ్రా, ఫైర్‌ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి వరకు సందడి చేసిన చిన్నారి బిస్తు ఘోష్ ఒక్కసారిగా మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us